ట్రెండ్‌ అవుతున్న '#CancelNetflix' హ్యాష్‌ ట్యాగ్‌

Update: 2020-09-11 12:10 GMT
అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ మైన ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ పై మరోసారి ఇండియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో రెండు మూడు సార్లు ఇండియన్స్‌ మనో భావాలను దెబ్బ తీసేలా నెట్‌ ఫ్లిక్స్‌ వ్యవహరించడంతో విమర్శల పాలయిన నెట్‌ ఫ్లిక్స్‌ తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ఈసారి కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా విమర్శలు ఎదుర్కొంటుంది. 'క్యూటీస్‌' అనే ఫ్రెంచ్‌ మూవీని తాజాగా నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది. అందులో ఉన్న కంటెంట్‌ పై విమర్శలను చవి చూసింది.

క్యూటీస్‌ మూవీలో 11 ఏళ్ల బాలికలతో అసభ్యంగా డాన్స్‌ లు చేయించడంతో పాటు వారిని అసభ్యంగా చూపించారు. చిన్న పిల్లలను అలా చూపించడం ప్రపంచ వ్యాప్తంగా కూడా సరైనది కాదుగా భావిస్తున్నారు. అందుకే సోషల్‌ మీడియాలో #CancelNetflix హ్యాష్‌ ట్యాగ్‌ తో తమ అభిప్రాయాలను షేర్‌ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదంటూ అంతర్జాతీయ స్థాయిలో అభిప్రాయం వ్యక్తం అవుతున్న ఈ నేపథ్యంలో నెట్‌ ఫ్లిక్స్‌ షేర్ల విలువ అంతర్జాతీయ మార్కెట్‌ లో ఏకంగా 4 శాతం వరకు పడి పోయినట్లుగా మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News