అందరి టార్గెట్ జయనే

Update: 2019-03-24 04:57 GMT
అతడు సినిమాలో బ్రహ్మాజీతో తనికెళ్ళ భరణి అనే డైలాగ్ ఒకటి బాగా ఫేమస్. మహేష్ బాబు ని చంపడానికి స్కెచ్ లో భాగంగా సందుకో సుమోని సెట్ చేయడం విని ఇన్ని బళ్ళెందుకురా బుజ్జి అనే మాట ఇప్పటికీ సోషల్ మీడియాలో సర్కాజంకు వాడుతూనే ఉంటారు. ఇప్పుడు జయలలిత బయోపిక్ ల ప్రహసనం చూస్తుంటే అదే గుర్తుకు వస్తోంది.

నిన్న కంగనా రౌనత్ జయలలితగా నటించబోతోంది అనే వార్త చదివి షాక్ తినని వారు లేరు. బొద్దుగా ఉండే జయలలిత శరీర స్వభావానికి కంగనాకు అసలు లంకె కుదరదు. మరి ఏ ప్రాతిపాదికన ఇలా ఆలోచించారో వాళ్ళకే తెలియాలి. ఇప్పటికే నిత్య మీనన్ తో ఒకటి విద్యా బాలన్ తో ఒకటి జయ బయోపిక్స్ అన్నౌస్ చేసి సైలెంట్ గా షూటింగ్ కూడా చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్

ఇప్పుడు కంగనాకు కూడా తోడయ్యింది. వీటిని హ్యాండిల్ చేయడంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఎంత ఖరీదైన మూల్యం చెల్లించుకోవాలో మన దగ్గర ఎన్టీఆర్ నిరూపించింది. రెండు భాగాలూ కలిపి పాతిక కోట్లు కూడా రాబట్టలేక బాలయ్యకు మచ్చలా మిగిలిపోయాయి. అక్కడ చూస్తేనేమో ఒకరిని మించి ఒకరు జయలలిత సినిమాలు తీసేందుకు ఎగబడుతున్నారు.

ఈ నేపధ్యంలో కంగనాది సీరియస్ గా తీస్తారా లేక ప్రకటన వరకే పరిమితమవుతుందా వేచి చూడాలి. కాంతారావు ఘంటసాల బయోపిక్స్ ఎక్కడి దాకా వచ్చాయో ఎలాంటి సమాచారం లేదు. డ్రామా అయితే జీవితం నిండా ఉన్న జయలలిత కథను అంత నిజాయితిగా వీళ్ళలో ఒక్కరైనా చూపించగలరా. అదే మిలియన్ డాలర్ల ప్రశ్న
    

Tags:    

Similar News