మాజీ భార్య కోసం పార్టీకి వ‌స్తున్నాడు

Update: 2016-10-19 13:04 GMT
ఎంత సెల‌బ్రెటీలైనా స‌రే.. ఒక‌సారి విడిపోయాక ఒక‌ప్ప‌టి ప్రేయ‌సిని కానీ.. భార్య‌ను కానీ క‌ల‌వ‌డానికి ఇబ్బందిగానే ఉంటుంది. ఇక క‌లిసి ఉండ‌లేమ‌ని విడిపోయాక‌.. మ‌ళ్లీ ఏ ర‌కంగానూ క‌ల‌వ‌డానికి పెద్దగా ఇష్ట‌ప‌డ‌రు. ఐతే హృతిక్ రోష‌న్.. సుసానెల‌కు మాత్రం ఇలాంటి మొహ‌మాటాలేమీ ఉన్న‌ట్లుగా లేవు. ఇద్దరూ త‌మ ఫీలింగ్స్ కంటే కూడా త‌మ పిల్ల‌ల ఆనంద‌మే ముఖ్యం అనుకుని.. అప్పుడ‌ప్పుడూ క‌లుస్తూనే ఉన్నారు. ఒక‌రి గురించి ఒక‌రు పాజిటివ్ గానే మాట్లాడుతూ వ‌స్తున్నారు. అంతే కాదు.. ఈసారి సుసానె పుట్టిన రోజు వేడుక‌ల‌కు కూడా హృతిక్ రోష‌న్ హాజ‌రు కాబోతుండ‌టం విశేషం.

ఈ నెల 26న సుసానె త‌న 38వ పుట్టిన రోజు జ‌రుపుకోబోతోంది. ముంబ‌యిలో గ్రాండ్ లెవెల్లో పార్టీ కూడా ఇస్తోంది సుసానె. ఈ వేడుక‌కు త‌న మాజీ భ‌ర్త హృతిక్ ను కూడా ఆహ్వానించింది సుసానె. అత‌ను కూడా ఆ పార్టీకి వ‌స్తాన‌ని హామీ ఇచ్చాడు. త‌న పిల్ల‌లు రెహాన్.. హృదాన్ ల‌ను సంతోష‌పెట్ట‌డానికే హృతిక్ ఈ పార్టీకి రాబోతున్నాడు. సుసానె కూడా వారి కోస‌మే హృతిక్ ను ఆహ్వానించింది. వీళ్లిద్ద‌రూ విడిపోయి దాదాపు రెండేళ్ల‌వుతున్నా.. పిల్ల‌ల కోసం అప్పుడ‌ప్పుడూ క‌లిసి వీకెండ్ డిన్న‌ర్ల‌కు కూడా హాజ‌ర‌వుతున్నారు. ఈ మ‌ధ్య కంగ‌నా ర‌నౌత్ కాంట్ర‌వ‌ర్శీ మొద‌లైన‌పుడు సుసానె.. హృతిక్ కు మ‌ద్ద‌తుగా మాట్లాడ్డం తెలిసిన సంగ‌తే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News