హృతిక్ బైసెప్ కి జై కొడుతున్న ఫ్యాన్స్!

Update: 2021-09-06 10:58 GMT
బాలీవుడ్ కండ‌ల‌ హీరో హృతిక్ రోష‌న్ ఫిట్ నెస్ విష‌యంలో ఎంత జాగ్ర‌త్త వహిస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. రోజుకు 3గం.లు కేవ‌లం జిమ్ కే కేటాయించే ఏకైక హీరో ఆయ‌న‌. చాలా స‌మ‌యాన్ని ఆయ‌న జిమ్ములోనే గ‌డుపుతారు. బాలీవుడ్ స్టార్ల‌లో బాడీని విల్లులా వంచే హీరోల‌లో హృతిక్ ఒక‌రు. అద్భుత‌మైన శ‌రీర సౌష్ట‌వంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తారు. తాజాగా హృతిక్ జిమ్ నుంచి ఓ కొత్త ఫోటోని అభిమానుల కోసం షేర్ చేశారు. అందులో హృతిక్ కండ‌లు చూపించి ఫిదా చేసారు. `ఫైట‌ర్` స్టార్ హృతిక్ త‌న టోన్డ్ బైస‌ప్స్  తో సూప‌ర్బ్ గా క‌నిపిస్తున్నారు. చెమ‌ట‌లు ప‌డుతూ జిమ్ములో క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నాన‌ని ఆయ‌న‌ చెప్ప‌క‌నే చెప్పారు. ఫోటో కోసం అద్దం ముందు హృతిక్ ఫోజులిచ్చారు.

ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. బాలీవుడ్ ప్ర‌ముఖులు త‌మ‌దైన శైలిలో దీనిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక టైగ‌ర్ ష్రాప్ అయితే హృతిక్ ని ఓ గురువులా భావిస్తారు. అత‌డు త‌న‌లోని భావాన్ని ఏమోజీ ద్వారా బ‌య‌ట పెట్టాడు.  అటు అభిమానులు ఫోటోపై త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. బాలీవుడ్ బైస‌ప్ కి జై అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక హృతిక్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న చివ‌రి సారిగా వార్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఆ యాక్ష‌న్  సినిమా భారీ విజ‌యాన్ని సాధించింది. ఆ త‌ర్వాత క‌రోనా ప్రారంభ‌మ‌వ్వ‌డంతో పూర్తిగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు.

ప్ర‌స్తుతం ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తోన్న నేప‌థ్యంలో మ‌ళ్లీ షూట్ కి రెడీ అవుతున్నారు. సిద్దార్ధ్  ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో `ఫైట‌ర్` చిత్ర‌లో న‌టించ‌డానికి రెడీ అవుతున్నారు. ఇందులోనూ బాడీ బిల్డ‌ర్ గా మార్ష‌ల్ ఆర్ట్స్ నిపుణుడిగా క‌నిపించ‌నున్నారు. అందుకోస‌మే హృతిక్  మ‌ళ్లీ  కఠోరంగా శ్ర‌మిస్తున్నారు.  ఇందులో  దీపికా ప‌దుకొణే  హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే  కోలీవుడ్ చిత్రం `విక్ర‌మ వేద` రీమేక్ లో కూడా న‌టించ‌నున్నారు. మ‌రో హీరోగా సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు.
Tags:    

Similar News