టాలీవుడ్ డైరెక్టర్ ని మెచ్చుకున్న హృతిక్.. ఫ్యూచర్ లో కలిసి సినిమా చేస్తారేమో..!

Update: 2021-01-06 16:03 GMT
'అర్జున్ రెడ్డి' సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఒక్క సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. అయితే వెంటనే తెలుగులో సినిమా చేయకుండా 'అర్జున్ రెడ్డి' సినిమాని 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. దీంతో సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సందీప్ ఇటీవలే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అప్‌డేట్ ఇచ్చాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు సందీప్.

గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'యానిమల్' అనే టైటిల్‌ ను ఖరారు చేస్తూ దీనికి సంబంధించిన ఓ వీడియోని విడుదల చేశారు. పరిణీతి చోప్రా హీరోయిన్‌ గా నటించనున్న ఈ సినిమాలో బాబీ డియోల్ - అనీల్ కపూర్ కీలక పాత్రలు పోషించనున్నారు. టీ-సిరీస్ - భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్ - ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్ నాడు రిలీజైన అనౌన్స్ మెంట్ వీడియో మంచి స్పందన తెచ్చుకుంది. అయితే ఆ వీడియో విడుదలైన ఐదు రోజులకు సందీప్ షేర్ చేసిన వీడియోని మెచ్చుకుంటూ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ట్వీట్ చేశాడు.

'యానిమల్' వీడియో చాలా బాగుంది.. ఫెంటాస్టిక్ గా ఉంది.. టీమ్ అందరికీ కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేసాడు హృతిక్. దీనికి స్పందించిన సందీప్ వంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. అయితే హృతిక్ రోషన్ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోనే ఈ రేంజ్ లో మెచ్చుకుంటున్నాడంటే.. ఫ్యూచర్ లో సందీప్ తో కలిసి సినిమా చేయాలని కోరుకుంటున్నాడేమో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరి కాంబోలో సినిమా వస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని జోష్యం చెబుతున్నారు. లైన్ గా రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ని రూపొందిస్తున్న సందీప్ వంగా.. తదుపరి సినిమా హృతిక్ రోషన్ తోనే ఉంటుందేమో..!
Tags:    

Similar News