• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్‌ ను శంకర్‌ ఎలా...

చరణ్‌ ను శంకర్‌ ఎలా చూపించబోతున్నాడంటే..!

By - Tupaki Desk
Update: 2021-06-28 12:30 GMT
తెలుగు మరియు తమిళ ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చరణ్‌.. శంకర్‌ ల కాంబో మూవీ అతి త్వరలోనే పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది. దిల్‌ రాజు ఈ సినిమా ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ నిర్మిస్తున్నాడు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా కోసం దర్శకుడు శంకర్ అద్బుతమైన కథను తయారు చేశారు. తెలుగు రచయితలు కూడా ఈ సినిమా కథ కుకింగ్ లో భాగస్వామ్యం అయ్యారనేది టాక్‌. ఇక ఈ సినిమా గురించి ఆ తెలుగు రచయితలు ఆసక్తికర విషయాలు చెబుతున్నారు.

ఒక రచయిత అనధికారికంగా మాట్లాడుతూ.. ఇదో మంచి సోషల్‌ మెసేజ్ ఉన్న సినిమా అని.. కమర్షియల్‌ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఈ సినిమాలో ఉంటాయని ఆయన అన్నాడు. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో ఈ సినిమా రూపొందుతుందని.. కాని చరణ్‌ మాత్రం పొలిటీషియన్‌ గా మాత్రం కనిపించడని చెబుతున్నారు. పొలిటికల్‌ డ్రామాలో హీరో పొలిటీషియన్‌ కాకుంటే ప్రభుత్వ అధికారి లేదా పోలీస్‌ అధికారి అయ్యి ఉంటాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చరణ్‌ ను శంకర్‌ ఏ పాత్రలో చూపించబోతున్నాడనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతోంది.

తెలుగు మరియు తమిళంలో రూపొందించబోతున్న ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే శంకర్‌ కు పాన్ ఇండియా స్టార్‌ డైరెక్టర్‌ గా గుర్తింపు ఉంది. ఇక ఆర్‌ ఆర్‌ ఆర్‌ తర్వాత చరణ్ కూడా ఖచ్చితంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోతున్నాడు. కనుక ఇది అసలు సిసలు పాన్ ఇండియా మూవీగా నిలుస్తుందని మెగా అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

కూతురు పెళ్లి హడావుడి పూర్తి అయిన నేపథ్యంలో శంకర్‌ మళ్లీ చరణ్‌ మూవీ పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. ఆర్ ఆర్‌ ఆర్‌ షూట్‌ పూర్తి అయిన వెంటనే శంకర్‌ కు చరణ్‌ డేట్లు ఇచ్చాడు. ఏడాది కాలంలోనే ఈ సినిమాను పూర్తి చేసేలా ఒప్పందం చేసుకున్నారని సమాచారం అందుతోంది. కనుక వచ్చే ఏడాది చివరి వరకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం గా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
Tags:    
  • kollywod Movies 
  • Kollywood Updates 
  • Kollywood Upcoming Movies 
  • Shankar 
  • Director Shankar 
  • ramcharan 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS