మెగాస్టార్ మూవీ రీమేక్ పనులు ఎక్కడి దాకా వచ్చాయ్...?

Update: 2020-08-21 15:30 GMT
మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150' తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలను లైన్లో పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న 'ఆచార్య' కరోనా కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకుంది. ఆ తర్వాత చిరంజీవి మళయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో నటించనున్నారని తెలుస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై రామ్ చరణ్ నిర్మించనున్నాడు. ఈ రీమేక్ కు 'సాహో' ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్నాడని.. ఇప్పటికే సుజీత్ మన నేటివిటీకి తగ్గట్లు తగినన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే 'లూసిఫర్' స్క్రిప్ట్ లో సుజీత్ చేసిన ఛేంజెస్ చిరుకి నచ్చలేదట. దీంతో ఈ రీమేక్ పనులు మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ కి అప్పగించారట.

కాగా చిరంజీవితో 'ఠాగూర్' 'ఖైదీ నెం.150' వంటి రెండు సక్సెస్ ఫుల్ రీమేక్స్ ఇచ్చిన వీవీ వినాయక్ ఇప్పటికే తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారట. మరోవైపు డైరెక్టర్ మెహర్ రమేష్ తమిళ్ మూవీ ''వేదలమ్'' ని చిరుతో రీమేక్ చేయడానికి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసాడని వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు 'జై లవకుశ' 'వెంకీమామ' దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కూడా మెగాస్టార్ కోసం ఇప్పటికే ఓ స్టోరీ రెడీ చేశాడని మరో వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఈ మూడు ప్రాజెక్ట్స్ లో ముందుగా దీన్ని చిరు పట్టాలెక్కిస్తాడో చూడాలి. చిరు పుట్టినరోజు నాడు 'ఆచార్య' తర్వాత చేయబోయే సినిమా గురించి ఏదైనా అనౌన్స్ మెంట్ ఇస్తారేమో చూడాలి.


Tags:    

Similar News