అల్లు రామాయణం.. హృతిక్ శ్రీరాముడు.. దీపిక సీత!
టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ - మధు మంతెన సంయుక్తంగా రామాయణం 3డి ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసినదే. ఇందులో శ్రీరాముడిగా హృతిక్ రోషన్ - సీతగా దీపికా పదుకొనే నటించనున్నారని ఇంతకుముందు కథనాలు వెలువడ్డాయి. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఫ్రాంఛైజీని రన్ చేయనున్నారని ప్రచారమైంది. ఈ సిరీస్ సినిమాలకు దంగల్ ఫేం నితేష్ తివారీ దర్శకత్వం వహించనున్నారు.
రామాయణం టెంపో చెడకుండా ఇతిహాస పవిత్రతను కాపాడుతూ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందని అందుకోసం రచయితలు సుదీర్ఘ కాలం పని చేయనున్నారని కూడా అప్పట్లోనే కథనాలొచ్చాయి. ఇంతకుముందు ఎన్ని రామాయణాలు వచ్చినా వాటన్నిటి కంటే లావిష్ గా గ్రాండియర్ గా ఈ సిరీస్ సినిమాల్ని తెరకెక్కించాలన్నది ప్రతిపాదన. త్వరలో చిత్రీకరణను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది.
తన భాగస్వాములు అనురాగ్ కశ్యప్- విక్రమాదిత్య మోత్వానే - వికాస్ బహల్ నుండి ఫాంటమ్ ఫిల్మ్స్ షేర్లను ఇటీవల కొనుగోలు చేసిన మధు మంతెన ఒంటరిగా ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారని తాజాగా కథనాలొస్తున్నాయి. అతని డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం 3డి ని తెరకెక్కించడానికి బాస్ అల్లు అరవింద్ నుంచి పుష్కలంగా ఆర్థికంగా అండలు ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.పవిత్ర గ్రంథంలోని ఏ అంశాన్ని వదిలివేయకుండా సుదీర్ఘ నిడివిగో ఈ సినిమాల్ని తెరకెక్కిస్తారు. రామాయణం 3డిని రెండు పూర్తి-నిడివి చలన చిత్రాలుగా విడుదల చేసేందుకు ఆస్కారం ఉందని తెలిసింది.
అద్భుతం అనిపించే స్టోరీ.. రీవిజనిస్ట్ స్క్రీన్ ప్లే ఈ ఫ్రాంఛైజీ కి కీలకం. రామాయణం పవిత్రతను కాపాడటానికి అనేక మంది పరిశోధకులను నియమించి పని చేయిస్తుండడం కూడా ఆసక్తికరం. హృతిక్ .. దీపిక సహా ఎ-లిస్టర్స్ స్టార్లను ఇటీవల ఖరారు చేస్తోంది చిత్రబృందం. శ్రీదేవి చివరి చిత్రం మామ్ కి దర్శకత్వం వహించిన రవి ఉద్యోవర్ కూడా ఈ ఇతిహాస సినిమాలకు స్క్రిప్టు పరంగా సాయం అందిస్తున్నారన్న సమాచారం ఉంది.