• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హాట్ టాపిక్ అయిన సరిలేరు...

హాట్ టాపిక్ అయిన సరిలేరు డైలాగ్స్

By - Tupaki Desk
Update: 2019-11-23 10:49 GMT
హాలీవుడ్ హీరోలు జస్ట్ యాక్షన్ చేస్తారు.. ఎపుడో ఒకసారి గానీ పంచ్ డైలాగ్స్ చెప్పరు. మన లాగా వాటిని పంచ్ డైలాగ్స్ అనరు.. వాటిని 'వన్ లైనర్స్' అనే పేరుతో పిలుస్తారు. కానీ మన టాలీవుడ్ సినిమాలో పంచ్ డైలాగ్స్ లేకపోతే ఆ సినిమాను ఉప్పులేని పప్పు.. మసాలా లేని బిర్యానికింద జమకడతారు ప్రేక్షకులు. అందుకే స్టార్ హీరోల సినిమాల్లో పంచ్ డైలాగ్స్ మోత మోగిపోతుంది.  సినిమాలో ఏం ఖర్మ.. జస్ట్ టీజర్ లోనే మూడు నాలుగు పంచ్ డైలాగ్స్ ఉంటాయి.  నిన్న శుక్రవారం విడుదలైన మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ లో పంచ్ ల పండగ జరిగింది.

"భయపడేవాడే బేరానికి వస్తాడు.. మన దగ్గర బేరాలు లేవమ్మా" అంటూ కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర మహేష్ బిగ్గరగా చెప్పే డైలాగ్ మాసుకు.. క్లాసుకు వెంటనే కనెక్ట్ అయిపోయింది.  అయితే సినిమాను నిజ జీవితంలోని పరిస్థితులతో పోల్చి చూడడం సహజం కాబట్టి మహేష్ ఫ్యాన్స్ ఈ డైలాగ్.. సంక్రాంతి పోటీలో ఉన్న 'అల వైకుంఠపురములో' టీమ్ కు ఇచ్చిన పంచ్ గా భావిస్తున్నారు.  'సరిలేరు నీకెవ్వరు'.. 'అల వైకుంఠపురములో' సినిమాలు ఒకే విడుదల తేదీని ప్రకటించడం.. తీవ్రమైన పోటీ నెలకొనడం తెలిసిన విషయాలే.  అయితే మహేష్ సినిమాను ఫైనల్ గా ఒకరోజు ముందుకు జరిపి 11 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.  అయితే దీంతో సంబంధం లేకుండా 'బేరల్లేవమ్మా' డైలాగ్ విడుదల డేట్ చర్చలకు.. బేర సారాలకు సంబంధించినదేనేని ఫ్యాన్స్ అభిప్రాయం.

ఇక టీజర్ లో మరో డైలాగ్ కూడా వివాదంగా మారుతోంది.  "ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు" అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ మహేష్ ను ఉద్దేశించినదే అయినా అది "ఎంతమంది అల్లుళ్ళు వచ్చినా ఈసారి సంక్రాంతి బాక్స్ ఆఫీస్ కు మహేష్ మొగుడు" అని ముందే ప్రకటించినట్టుగా ఉంది. ఇది కూడా ఫ్యాన్స్ ఇతర సినిమాలకు మహేష్ టీమ్ ఇచ్చిన పంచ్ అని భావిస్తున్నారు.  సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చాలామంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.  అయితే కొందరు మాత్రం ఈ పంచులు అన్నీ మాస్ ప్రేక్షకుల కు కిక్కివ్వడానికి మాత్రమేనని.. అంతకు మించి మరేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా దర్శకుడు అనిల్ రావిపూడి తన డైలాగ్స్ తో కాక రేపాడు అనేది వాస్తవం.
Tags:    
  • Sarileru Neekevvaru 
  • Sarileru Neekevvaru Teaser 
  • Mahesh Babu Dialouges In Sarileru Neekevvaru 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Tupaki News 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS