మరో నటుడిని మింగేసింది కరోనా

Update: 2020-07-08 10:50 GMT
ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందిని కరోనా మింగేస్తుంది. ఆ జాబితాలో స్టార్స్.. సెలబ్రెటీలు కూడా ఉన్నారు. హాలీవుడ్ బాలీవుడ్ ఇలా పలు భాషలకు చెందిన నటీనటులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే పలువురు మృతి చెందగా తాజాగా మరో నటుడు కూడా కరోనా కారణంగా మృతి చెందాడు.

హాలీవుడ్ కు చెందిన నిక్ కార్డెరో కరోనాతో మృతి చెందినట్లుగా ఆయన భార్య సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. కెనడాకు చెందిన నిక్ చాలా కాలంగా న్యూయార్క్ లో ఉంటున్నారు. స్టేజ్ ఆర్టిస్ట్ గా సినిమా నటుడిగా బుల్లి తెరపై కూడా విశేష గుర్తింపు దక్కించుకున్నాడు.

నిక్ 95 రోజుల పాటు హాస్పిటల్ లో కరోనాతో పోరాడి చివరకు కన్నుమూశాడు. ప్రతి ఒక్కరినీ కూడా ప్రేమించే వ్యక్తి అని.. గొప్ప నటుడు మాత్రమే కాకుండా నిక్ గొప్ప వ్యక్తి అంటూ ఆయన భార్య అముందా సోషల్ మీడియా ద్వారా తన ఎమోషన్ ను షేర్ చేసుకుంది.
Tags:    

Similar News