కామెంట్: హాలీవుడ్ సీక్వెల్సే బెటర్

Update: 2016-12-15 01:30 GMT
మన దగ్గర ఓ సినిమా హిట్టైతే అది అక్కడితోనే ఆగిపోయేది. కానీ హాలీవుడ్లో మాత్రం సీక్వెల్ అంటూ దానికి కంటిన్యూగా మరో మూవీ వచ్చేయడం కామన్. ఒకే పేరుతో పార్ట్స్.. పార్ట్స్ గా సినిమాలు రావడం హాలీవుడ్ ట్రెండ్. బ్రాండ్ పేరు చెప్పుకోని సినిమాలు అమ్ముకునే తెలివితేటలు ఇవి. పేరు వెనక ఇంత వ్యాపారం ఉంది కాబట్టే ఇప్పుడు మనోళ్లు కూడా ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు. ఓ పదేళ్ల నుంచి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా సీక్వెల్స్ సిరీస్ కనిపిస్తోంది.

ధూమ్.. సింగం.. క్రిష్.. దబాంగ్.. గోల్ మాల్.. బాహుబలి ఇవన్నీ హిట్ సిరీస్ సీక్వెల్స్. అలాగని ప్రతీ సినిమాకి తర్వాత వచ్చే పార్ట్ హిట్టవుతుందా అంటే గ్యారంటీ లేదు. దానికి 2016 బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఏడాది బాలీవుడ్లో హిట్ మూవీస్ కి చాలా సీక్వెల్సే వచ్చాయ్. కానీ రిజల్ట్ మాత్రం ఆశించినంత గొప్పగా లేదు. సేమ్ నేమ్ పెట్టుకోని పార్ట్ టూ అని వస్తే సరిపోదుగా. కథలో దమ్ము కూడా ఉండాలి. ఆ సత్తా లేకే దాదాపు అన్నీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తేలిపోయాయ్.

క్యా కూల్ హై హమ్-3 - ఘాయల్ వన్స్ అగైన్ - తేరే బిన్ లాడెన్- డెడ్ ఆర్ ఎలైవ్ - 1920- లండన్ - జై గంగాజల్ - హౌస్ ఫుల్-3 - గ్రేట్ గ్రాండ్ మస్తీ - రాజ్ రీబూట్ - రాక్ ఆన్-2 - తుమ్ బిన్-2 ఫోర్స్-2 - కహానీ-2 అంటూ లెక్కేసుకోడానికి చాలా సినిమాలే వచ్చాయ్. వీటిలో హౌస్ ఫుల్ త్రీ కాస్త బెటర్ గా పెర్ఫామ్ చేసింది. కానీ హౌస్ ఫుల్ ఫ్రాంఛైజీతో పొల్చితే ఈ సినిమా గొప్ప హిట్ కాదనుకోవాలి. గంగాజల్ కి సీక్వెల్ గా వచ్చిన జై గంగా జల్ - క్యా కూల్ హే హమ్ త్రీ కూడా పర్వాలేదనిపించాయ్. మిగిలినవన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డవే.

అదే సమయంలో ద కన్ జ్యూరింగ్2 - ఎక్స్ మెన్- అపోకలిప్స్ - కెప్టన్ అమెరికా- సివిల్ వార్ అండ్ ఇన్ ఫెర్నో - కుంగ్ ఫూ పాండా3 - లండన్ హాజ్ ఫాలెన్ - ఫైండింగ్ డోరీ లాంటి హాలీవుడ్ సీక్వెల్స్ మన దగ్గర కలెక్షన్స్ కొల్లగొట్టాయ్. కథపరంగా వీటిల్లో కూడా కొత్తదనమేమీ లేనప్పటికీ.. టేకింగ్.. మేకింగ్ లాంటివి మనోళ్లకి తెగ నచ్చేశాయ్. అందుకే రోటీన్ అయినా వాటిని నెత్తిన పెట్టుకొన్నారు. నెక్ట్స్ ఇయర్ కూడా ఇటు బాలీవుడ్.. అటు హాలీవుడ్ నుంచి బోల్డన్నీ సీక్వెల్స్ రెడీగా ఉన్నాయ్. మరి ఇవన్నా ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయో.. తిరుగుటపాలో వెళ్లిపోతాయో చూడాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News