టాప్ స్టోరి: ఇంట గెలిచి రచ్చ గెలిచిన స్టార్లు
హాలీవుడ్ ఫిలిం మేకర్స్ ని సైతం తమదైన నటప్రతిభతో ఆకట్టుకున్న స్టార్స్ మన భారతీయుల్లో ఎందరు ఉన్నారు? అంటే.. చాలా మందే వున్నారని తాజా లిస్ట్ పరిశీలిస్తే అర్థమవుతోంది. దేశ వ్యాప్తంగా తమదైన నటనతో పాపులారిటీని సొంతం చేసుకున్న తారల్లో చాలా మంది హాలీవుడ్ లోనూ నటులుగా మెరిసారు. ఇంట గెలిచి రచ్చ గెలిచిన మన వాళ్లు నటించింది క్రేజీ చిత్రాల్లోనే.
`ది గ్రేట్ గాస్ బే`లో అమితాబ్ నటించారు. `బ్లడ్ స్టోన్`తో రజనీ మెరిపించారు. `క్విక్‌గన్ మురుగన్` రాజేంద్ర ప్రసాద్... రంభ చక్కని హాస్యనటులుగా నవ్వించారు. `స్లమ్ డాగ్ మిలియనీర్..., మిషన్ ఇంపాజిబుల్ చిత్రాలతో మిస్టర్ ఇండియా అనిల్ కపూర్ అదరగొట్టారు. కాకపోతే నెగెటివ్ క్యార్టర్లలో ఆయన కనిపించాడు. `స్లమ్ డాగ్ మిలియనీర్`తో ఇర్ఫాన్ ఖాన్ ,.. ప్రిదా పింటో,.. దేవ్ గిల్ హాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఆ తరువాత కూడా ఇర్ఫాన్ ఖాన్ పలు చిత్రాల్లో కనిపించాడు. `ద ఎక్సార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్`తో ధనుష్ ప్రయత్నించాడు. `లైఫ్ ఆఫ్ పై` తో టాబు కూడా హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇదే చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్ కూడా నటించాడు.
షబానా అజ్మీ కూడా హాలీవుడ్ సినిమాల్లో మెరిసింది. మిడ్ నైట్ చిల్ద్రన్స్..., సిటీ ఆఫ్ జాయ్ సినిమాల్లో ఆమె నటించింది. ఇక ఐశ్వర్యారాయ్ ఏకంగా నాలుగు చిత్రాల్లో నటించింది. ది బ్రైడ్ అండ్ ప్రిజుడీస్,.. పింక్ పాంథర్ 2,.. ది మిస్ట్రెస్ స్పైసెస్,.. ప్రోవోక్డ్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రియాంక క్వాంటికో,.. బేవాచ్,.. దీపికా పదుకోన్ `xxx : ది రిటర్న్ ఆఫ్ క్జాండర్ కేజ్`మంచు లక్ష్మి కూడా ది ఓడ్..., డెడ్ ఏయిర్ వంటి చిత్రాల్లో నటించింది. కబీర్ బేడీ జేమ్స్ బాండ్ చిత్రాల్లోని `ఆక్టోపస్`తో పాటు పలు చిత్రాల్లో నటించారు. ఓంపురి.., అనుపమ్ ఖేర్,.. నసీరుద్దీన్ షా వంటి వాళ్లు కూడా పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. చిరంజీవి కూడా హాలీవుడ్ సినిమా లో నటించాలనుకున్నారు కానీ అది కార్యరూపం దాల్చలేదు. `అబు బాగ్దాద్ గజదొంగ` కొంత షూటింగ్ జరుపుకుని మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా మరో హీరో హృతిక్ రోషన్ కూడా హాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాడు. ఇంకా ఈ లిస్ట్ చాలా పెద్దదే ఉంది.