డైరెక్టర్ కు హిట్టు.. ఆ హీరోకు నచ్చడం లేదట!

Update: 2020-02-22 05:21 GMT
అసూయ లేని వారు తక్కువమందే ఉంటారు.  పైకి చాలానే చెప్తారు కానీ కొందరు హీరోలకు ఈగో లాంటి ఇంగ్లీష్ లక్షణాలు.. అసూయ లాంటి అచ్చ తెలుగు లక్షణాలు క్వార్టర్ గా కాకుండా ఫుల్లుగా ఉంటాయట.  ఈమధ్య ఒక సినిమాకు పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో మరో హీరోకు కోపం వస్తోందట..  కడుపులో భగభగమని మండిపోతోందట.  

విషయం ఏంటంటే ఈమధ్యే ఒక యువ హీరో సినిమా విడుదలైంది. సినిమాకు ఏకగ్రీవంగా హిట్ టాక్ వచ్చింది.  ఈ సినిమా దర్శకుడు రెండో సినిమా గండం తప్పించుకున్నాడని కూడా మెచ్చుకుంటున్నారు. అయితే ఈ దర్శకుడికి తన మొదటి సినిమా హీరోకు కథ విషయంలో ఏదో తకరారు నడుస్తోంది.  ఆ మొదటి సినిమా హీరో ఆ విషయంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ డైరెక్టర్ పై విమర్శనాస్త్రాలు కూడా సంధించాడు.  అయితే ఆ విమర్శలపై ఈ దర్శకుడు ఎంతో పరిణతి తో స్పందించాడు.  ఆ వివాదం పెద్దది కాకుండా మెచ్యూరిటీ తో ఫుల్ స్టాప్ పెట్టాడు.

ఇప్పుడు రెండవ సినిమా కూడా హిట్ కావడంతో డైరెక్టర్ టాలెంట్ అందరికీ తెలిసింది. మొదటి సినిమా కథ కూడా డైరెక్టర్ దేనని ఎక్కువ మంది నమ్ముతున్నారు.  ఆ సినిమా హీరోగారే ఏవో పబ్లిసిటీ స్టంట్స్ చేసి నలుగురిలో చెడ్డపేరు తెచ్చుకున్నాడని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది.  ఈ దర్శకుడి కొత్త సినిమాకు సూపర్ హిట్ రావడంతో ఆ మొదటి సినిమా హీరోకు ఇబ్బంది గా మారింది.  ఇదిలా ఉంటే ఈ దర్శకుడు రెండవ సినిమా చేసిన బ్యానర్ లోనే మరో సినిమా చేయబోతున్నాడు.. ఆ హీరో కూడా సేమ్ బ్యానర్ లో మరో సినిమాకు కమిట్ అయ్యాడట. ఈ హీరో -దర్శకుడి మధ్య గొడవ నిర్మాతలకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు లేక పోలేదని టాక్ వినిపిస్తోంది.  మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Tags:    

Similar News