బాహుబలి కట్టప్పగా సత్యరాజ్ పాపులారిటీ గురించి తెలిసిందే. అమరేంద్ర బాహుబలి వెన్నుపోటు దారుడుగా రికార్డులకెక్కాడు. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? అంటూ సత్యరాజ్ కి బోలెడంత పబ్లిసిటీ చేసి పెట్టారు జక్కన్న. ఆ ఒక్క రోల్ సత్యరాజ్ దశ దిశ తిప్పేసింది. ప్రస్తుతం అతడి రేంజు మునుపటి కంటే రెట్టింపైంది. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండుచోట్లా బిజీ ఆర్టిస్టుగా క్షణం తీరిక లేకుండా సినిమాల్లో నటిస్తున్నారు. శివగామి రమ్య కృష్ణతో కలిసి కొన్ని వాణిజ్య ప్రకటనల్లోనూ నటించిన సత్యరాజ్ .. బాహుబలి 1, 2 తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాల్లోనే నటించారు.
నేను శైలజ.. బ్రహ్మోత్సవం.. హైపర్ .. నోటా.. చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ఇటీవలే నాని నటించిన జెర్సీలో క్రికెట్ కోచ్ పాత్రలో అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఈ ట్యాలెంటెడ్ సీనియర్ ఆర్టిస్ట్ ఒక్కో సినిమాకి ఎంత పారితోషికం అందుకుంటారు? అంటే.. బాహుబలి లో నటించినందుకు రూ.2కోట్ల ప్యాకేజీ అందుకున్నారట. ఇతర సినిమాలకు కాల్షీట్లను బట్టి పారితోషికం ఉంటుంది. రోజుకు రూ.3లక్షలు అందుకుంటున్నారట. ఇంతకుముందు హీరోగా రూ.2 కోట్ల నుంచి రూ.5కోట్లు అందుకున్నారు. తమిళంలో రూ.2కోట్ల పారితోషికం రేంజ్ ఉందని తెలుస్తోంది.
జెర్సీ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించనున్న తాజా చిత్రంలోనూ ఓ కీలక పాత్రకు ఎంపికయ్యారు. త్వరలోనే ఈ సినిమా లాంచింగ్ ఉంటుందని తెలుస్తోంది. ఇదే గాక ప్రస్తుతం పలువురు టాలీవుడ్ యంగ్ హీరోల సినిమాల్లోనూ సత్యరాజ్ కి ఛాన్సులున్నాయి. కోలీవుడ్ లోనూ క్రేజీ సినిమాల్లో నటిస్తున్నారు. తమిళంలో పార్టీ, మదై తిరంతు- తీర్పుకల్ విర్కపాడుమ్, ఖాకీ చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే సత్యరాజ్ కి ఇన్ని ఆఫర్లు ఎలా వస్తున్నాయి? అంటే ఒదిగి ఉండే తత్వంతోనే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయని ఓ నిర్మాత చెబుతున్నారు. ఒక సీన్ కోసం మధురై నుంచి చెన్నయ్ కి చెన్నయ్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన సత్యరాజ్.. మీకు సీన్ లేదని చెప్పగానే మాటవరసకు అయినా చికాకు పడకుండా ఫర్వాలేదు బాబూ అంటూ వెళ్లిపోయారట. నాని చెప్పిన జెర్సీ అనుభవమిది. మొత్తానికి సత్యరాజ్ రేంజు అలా సాగుతోంది.
ఇక కట్టప్పతో పాటు బాహుబలిలో నటించిన శివగామి పాత్రకు అంతే పేరొచ్చింది. ఈ పాత్ర కోసం రమ్యకృష్ణ సైతం కట్టప్ప తో సమాన పారితోషికం అందుకున్నారని అప్పట్లో ప్రచారమైంది. బాహుబలి కోసం రూ.2-3 కోట్లు అందుకున్నారని ప్రచారమైంది. రోజుకు రూ.5-6లక్షల పారితోషికం అందుకునే సత్తా ఉన్న స్టార్ గా సౌత్ లో రమ్యకృష్ణ పాపులరయ్యారు. ఇటీవలే జయలలిత జీవితకథతో తెరకెక్కుతున్న ఓ వెబ్ సిరీస్ కోసం రూ.2కోట్ల పారితోషికం అందుకున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.