ప్రభాస్ భూమిపై హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్ లోని రాయదుర్గం లో సినీ హీరో ప్రభాస్ కు చెందిన 2083 చదరపు గజాల స్థలంలోని నిర్మాణాలపై స్టేటస్ కో ఆదేశాలు పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ స్థల వివాదానికి సంబంధించి నిరుడు ఏప్రిల్ 23న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం ప్రస్తావించింది.
ప్రభాస్ భూమి ప్రభుత్వానికి అంటూ అధికారులు సీజ్ చేశారు. ఈ ఆస్తులపై ప్రభాస్ హైకోర్టుకెక్కారు. ఈ ఆస్తులపై స్టేటస్ కో పాటించాలని ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని స్పష్టం చేసింది.
ఈ ఆస్తిని పిటిషనర్ ప్రభాస్ కు స్వాధీనం చేయాల్సిన అవసరం లేదని..వాటిని రెవెన్యూ అధికారుల స్వాధీనంలో ఉంచాలని తేల్చిచెప్పింది.
ఇక ఈ స్థల యాజమాన్య హక్కుల కోసం సివిల్ కోర్టులో న్యాయ పోరాటం చేయవచ్చని ప్రభాస్ కు సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులు అమల్లో ఉండగానే.. హీరో ప్రభాస్ రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి ఇంజక్షన్ ఉత్తర్వులు తెచ్చుకొని ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అధికారులు హైకోర్టుకు ఎక్కగా స్టేటస్ కో ఆదేశాలు అమల్లో ఉంటాయని.. ఈ ఆస్తిని ఎటు కదలించడానికి స్వాధీనానికి వీల్లేదని స్పష్టం చేశారు.