• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గ్రాండ్‌ మస్తీ.. ఇక అందరూ...

గ్రాండ్‌ మస్తీ.. ఇక అందరూ మటాష్‌

By - Tupaki Desk
Update: 2015-09-02 15:51 GMT
మాట‌ల్లో ద్వంద్వార్థం, విజువ‌ల్స్‌లో క్లీవేజ్ షోలు ఇలాంటివి ఉంటే ఆ సినిమాల్ని బుల్లిత‌ర‌పై ప్ర‌సారం చేయ‌డం నిలిపేయాల‌ని హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆ త‌ర‌హాలోనే అప్ప‌ట్లో  పెద్ద‌ల కోసం తీసిన  గ్రాండ్ మస్తి  చిత్రాన్ని బుల్లితెర‌పై ప్ర‌సారం చేయొద్ద‌ని  జీ గ్రూపును ఆదేశించింది హైకోర్టు. ఏపీ కేంద్రంగా నడిచే మీడియా వాచ్ సంస్థ ఉపాధ్యక్షుడు ఈదర గోపీచంద్ వేసిన పిటిషన్ ను విచారించిన అనంత‌రం ఢిల్లీ హైకోర్టు ఈ నిర్ణ‌యం వెలువ‌రించింది.  మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ విచారణను సెప్టెంబర్ 16 కు వాయిదావేశారు.

పిల్ల‌ల‌ను చెడు దారి ప‌ట్టించే అస‌భ్య‌క‌ర‌మైన సినిమాల్ని బుల్లితెర‌పై ప్ర‌సారం చేయ‌కూడ‌ద‌ని కోర్టు ఆదేశించింది. సెన్సార్ స‌ర్టిఫికేష‌న్ ఉన్నంత మాత్రాన అది బుల్లితెర‌కు అన‌ర్హం కాద‌ని చెప్పింది. గ్రాండ్ మ‌స్తీలో ద్వంద్వార్థాలూ, అత్యంత అభ్యంతరకరమైన  అంశాలూ ఉన్నాయి. అలాంటి సినిమాకి సెన్సార్‌ యు/ఎ సర్టిఫికెట్ ఎలా ఇచ్చింది అని పిటిష‌న‌ర్ వాదించారు.  పెద్దలతో కలిసి పిల్లలు చూడ‌ద‌గ్గ సినిమానా? అని న్యాయ‌వాదులు వాదించారు. పిల్ల‌లు టీవీ చూసే వేళ‌ల్లో పెద్ద‌లు ఉండాల‌ని రూలేం ఉంది అన్న వాద‌న సాగింది.  సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖకు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ( సెన్సార్ బోర్డ్) కు నోటీసులు జారీచేస్తూ, సెప్టెంబర్ 16 లోగా సమాధానాలివ్వాలని ఆదేశించింది. ఈ తీర్పు వెలువ‌డితే తెలుగు సినిమాల‌కు ప్రకంపనలు మొద‌లైన‌ట్టే.

ఇప్ప‌టికే న్యూడ్ కంటెంట్ ఉన్న చాలా సినిమాల‌కు ఇది పెద్ద స‌వాల్ లాంటిది. ఈ ఏడాది ఇప్ప‌టికే క్రేజీ సినిమాలు రిలీజ్‌ల‌కు రెడీ అవుతున్నాయి. మ‌రీ న్యూడిటీని న‌మ్ముకుని తీసే చ‌వ‌క‌బారు సినిమాల‌కు ఇక నుంచి శాటిలైట్ ద‌క్క‌డం అన్న‌ది అసాధ్యం. ఈ తీర్పు ప్ర‌భావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈనెల 16 డెడ్‌లైన్‌. ఇప్ప‌టికే సెట్స్‌లో బూతు సినిమాలు ఏవైనా ఉంటే వాటిని ఆపేయ‌డ‌మే మంచిద‌ని కొంద‌రు ఇప్ప‌టికే విశ్లేషిస్తున్నారు.
Tags:    
  • High Court 
  • Banned 
  • Grand Masti 
  • TV 
  • Telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS