#DRUGS కేసులో జైలు కెళ్లేందుకు మొండికేసిన‌ న‌టి

Update: 2020-09-17 09:30 GMT
డ్రగ్స్ కేసులో క‌న్న‌డ తార‌లు రాగిణి ద్వివేది.. సంజన గ‌ల్రానీ అరెస్టయిన విషయం తెలిసిందే. బెయిల్ ఇవ్వ‌క‌పోవ‌డంతో జైల్లోనే మ‌గ్గాల్సిన ప‌రిస్థితి ఉంది. ఆ క్ర‌మంలోనే విచార‌ణ‌లో సంజ‌న స‌హా రాగిణి క‌న్న‌డ ఇండ‌స్ట్రీతో ముడిప‌డి ఉన్న డ్ర‌గ్స్ రాకెట్ గురించి అలాగే హీరోల‌కు ఉన్న లింకుల గురించి చాలా విష‌యాల్ని వెల్ల‌డించార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఆ ఇద్ద‌రూ మాద‌క ద్ర‌వ్యాలు సేవిస్తార‌ని అలాగే ఇండ‌స్ట్రీ వ్య‌క్తుల‌కు స‌ర‌ఫ‌రా చేస్తార‌ని కూడా ఇటీవ‌ల ప‌లు మీడియాల క‌థ‌నాలు వెల్ల‌డించాయి. మునుముందు ఇంకా అరెస్టుల ఫ‌ర్వం కొన‌సాగ‌నుంద‌ట‌. ఇక ఆ ఇద్ద‌రు క‌థానాయిక‌ల్ని ఒకే సెల్ లో ఉంచాల‌ని చూస్తే ఇరువురి మ‌ధ్యా ప‌ర‌స్ప‌ర యుద్ధం కొన‌సాగింద‌న్న చ‌ర్చా సాగింది. వేరే సెల్ ని కోరుకున్నార‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి.

అదంతా అలా ఉంచితే సెంట్ర‌ల్ జైల్ లాంటి పెద్ద జైలుని చూడ‌గానే హీరోయిన్ సంజ‌న‌లో గుబులు పుట్టింద‌ట‌. లోనికి వెళ్లేందుకు అధికారుల‌ను స‌తాయించింద‌ని... అక్క‌డ పెద్ద గేటు తెర‌వాల‌ని ఫిక‌ర్ చేసింద‌ని అయితే జైలు అధికారులు బెదిరించ‌డంతో ఆ చిన్న గేట్ లోంచే లోనికి వెళ్లింద‌ని ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం సాగిపోతోంది. తొలిసారి జైల్ ని చూడ‌గానే సంజ‌న కాస్త కంగారు గా నే క‌నిపించిందిట‌.

ఇక బెయిల్ అర్జీ విచారణ శుక్రవారానికి వాయిదా వేయ‌డంతో సంజనకు ఏం చేయాలో పాలుపోవ‌డం లేద‌ని తెలుస్తోంది‌. తాజాగా సీబీఐ అధికారుల విచార‌ణ‌లో ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల పేర్ల‌ను ఆ ఇద్ద‌రూ రివీల్ చేశార‌న్న ప్ర‌చారం సాగిపోతోంది. ఇందులో సినీహీరోలు ఉన్నార‌ని ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌తో లింకులు బ‌య‌ట‌ ప‌డ్డాయ‌ని ర‌క‌ర‌కాలుగా క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి.
Tags:    

Similar News