డ్రగ్స్ కేసులో రాగిణికి జైల్లో చుక్కలు.. కస్టడీలో సంజన

Update: 2020-09-15 07:30 GMT
కర్ణాటకలో వెలుగుచూసి డ్రగ్స్ కేసులో ఇద్దరు హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలోనే రాగిణి కస్టడి ముగియడంతో పోలీసులు జైలుకు తరలించారు. సంజనను సీసీబీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే సంజన, రాగిణిని పోలీసులు విచారించారు.

రాగిణి ఉంటున్న సెంట్రల్ జైల్లోనే ప్రముఖులున్నారు. సెంట్రల్ జైల్లో నటి రాగిణి తొలిరాత్రి చేదు అనుభవాలతో గడిపిందని తెలిసింది.   రాగిణి ఉంటున్న పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోనే చిన్నమ్మ వీకే. శశికళ నటరాజన్ కూడా ఉంటున్నారు.

జైలు నిబంధనల ప్రకారం నటి రాగిణికి జైలు అధికారులు ఖైదీ నెంబర్ 8912 నెంబర్ కేటాయించారు రాగిణికి కేటాయించిన ఖైదీ నెంబర్ 8912 నెంబర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాగిణికి ఖైదీ నెంబర్ 8912 అనే ఫ్యాన్సీ నెంబర్ కేటాయించారని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

నటి రాగిణికి అనారోగ్యంగా ఉందని, ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందడానికి అవకాశం ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో మనవి చేశారు. అయితే కోర్టు అందుకు అంగీకరించలేదు

మరో నటి సంజనా ప్రస్తుతం బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల కస్టడీలో ఉంది. బెయిల్ కోసం నటి సంజనా కోర్టులో పిటిషన్ దాఖలు చెయ్యకపోవడంతో ఆమెను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసు కస్టడీ గడుపు పూర్తి అయిన తరువాత నటి సంజనా బెయిల్ కోసం ప్రయత్నాలు చెయ్యకపోతే ఆమెను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.

మొత్తంగా డ్రగ్స్ కేసులో ఒక హీరోయిన్ రాగిణి జైలు పాలయ్యే తొలి రోజు భారంగా ముగించగా.. మరో నటి సంజన పోలీస్ కస్టడీకి వెళ్లింది. ఇలా ఇద్దరు హీరోయిన్లు డ్రగ్స్ కేసులో పీకల్లోతు మునిగిపోయారు.
Tags:    

Similar News