• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దివంగత స్టార్ హీరోను...

దివంగత స్టార్ హీరోను గుర్తుచేసుకున్న హీరోయిన్..!

By - Tupaki Desk
Update: 2021-04-30 10:55 GMT
గతేడాది జూన్ నెలలో కన్నడ హీరో చిరంజీవి సార్జా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అసలే ఓవైపు కరోనాతో దేశం అల్లకల్లోలం అవుతుంటే మరోవైపు అభిమాన సినీతారల గురించి మరణవార్తలు  వింటూ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అయితే దివంగత సినీనటుడు చిరంజీవి సార్జా భార్య మేఘనా రాజ్ ఇంకా తన భర్త గురించి తలచుకుంటూనే ఉంది. భర్తను కోల్పోయి ఏడాది కావస్తుంది అంటేనే ఆమె నమ్మలేకపోతుంది. భర్త చనిపోయిన నాలుగు నెలలకే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మేఘనా.. ప్రస్తుతం కొడుకునే భర్త జ్ఞాపకాలతో ప్రేమగా అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. అయితే తాజాగా మేఘనా తన భర్త చిరంజీవిని మరోసారి గుర్తుచేసుకుంది.

చిరంజీవి - మేఘనా 2018లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అంగారా అనే సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ ప్రేమించుకొని తల్లిదండ్రులను ఒప్పించి ఒక్కటయ్యారు. కానీ పెళ్ళైన రెండేళ్లకే మేఘనా భర్తను కోల్పోయింది. అయితే ఇప్పటికే భర్తను తలచుకుంటూ వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, హ్యాపీ మూమెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. తాజాగా మేఘనా.. తన భర్తతో ఈఫిల్ టవర్ దగ్గర దిగిన హ్యాపీ పిక్ ఒకటి షేర్ చేసింది. అలాగే 'త్వరగా తిరిగిరా.. లవ్ యూ' అంటూ తన ప్రేమను వెల్లడించింది. ఫోటోలో చిరంజీవి - మేఘనా చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎలాగో ఆయన తిరిగిరాడు కాబట్టి ఫ్యాన్స్ కూడా మేఘనాను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే మళ్లీ సినిమాలు చేస్తానని ఇటీవలే ప్రకటించింది మేఘనా. చూడాలి మరి సినిమాలతో అయినా హ్యాపీగా ఉంటుందేమో!
Tags:    
  • Chiranjeevi Sarja 
  • Meghana Raj Sarja 
  • Instagram 
  • Kannada hero 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS