• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భయపడే కీర్తి సురేష్ ని...

భయపడే కీర్తి సురేష్ ని తప్పించారా ?

By - Tupaki Desk
Update: 2019-02-17 09:20 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ దూకుడు మాములుగా లేదు. హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా వరసబెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. పేట మన దగ్గర పోయింది కానీ తమిళనాడులో వంద కోట్ల వసూళ్లు రాబట్టి చాలా కాలం తర్వాత ఫ్యాన్స్ కోరుకున్న బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. పాత రూపంలో రజని స్టైల్ ని దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఆవిష్కరించిన తీరుకు వసూళ్ల వర్షం కురిసింది. ఇదిలా ఉండగా దీని తర్వాత రజని మురుగదాస్ కు ఓకే చెప్పిన సంగతి తెల్సిందే.

ప్రస్తుతం స్క్రిప్ట్ ని లాక్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు దాస్. తొలుత హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకుంటారనే టాక్ చాలా బలంగా చెన్నై మీడియాలో వినిపించింది. సర్కార్ టైంలో కీర్తి పనితనం నచ్చిన దాస్ ఈ ఆఫర్ తనకే ఇచ్చాడని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఇందులో చేంజ్ వచ్చేలా ఉంది. గతంలో కాలా ఆడియో ఫంక్షన్ లో ఇకపై తాను కూతురి వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ చేయనని రజని పబ్లిక్ గానే చెప్పేసారు. దానికి తగ్గట్టే 2.0-పేటలలో టూ యంగ్ బ్యూటీస్ అవసరం పడలేదు.

ఇప్పుడు కీర్తి సురేష్ తో చేస్తే కనక ఆ అమ్మాయి రజని ఇద్దరు కూతుళ్ళ కంటే చాలా చిన్న వయసుది. తనతో కలిసి డ్యూయెట్స్ చేస్తే విమర్శలు వచ్చి పడతాయి. మాట తప్పుతారా అంటూ కామెంట్ల దాడి చేస్తారు. అందుకే నయనతారను తీసుకునే ఆలోచనలో ఉందట టీమ్. మురుగదాస్ తో గజినీ రజనీకాంత్ తో చంద్రముఖి చేసిన నయన్ అయితే ఎలాంటి ట్రాలింగ్ కు అవకాశం ఉండదు. పైగా తను సీనియర్ హీరోయిన్. ఈ కోణంలో ఆలోచించే ఇలా చేస్తున్నారని తెలిసింది. అధికారిక ప్రకటన త్వరలోనే రావొచ్చు
    

Tags:    
  • Keerthy Suresh 
  • Rajinikanth 
  • Murugadoss 
  • Movie News 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS