హీరోలు రియ‌ల్ హీరోలు అవ్వాలి కానీ..!

Update: 2020-06-03 04:33 GMT
అవును.. హీరోలు రియ‌ల్ హీరోలు అవ్వాల్సిన త‌రుణ‌మిదే. క‌ష్టాల్లో ఉన్న నిర్మాత‌ల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చి తామేంటో నిరూపించాలి. అయితే అలా జ‌రుగుతోందా? అన్న‌దానిపై క్షేత్ర‌స్థాయి ప‌రిశీలన చేస్తే సీన్ పూర్తిగా వేరేగా ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

జూన్ తొలి వారం నుంచి షూటింగులు చేసేసుకోవ‌చ్చ‌ని అయితే ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల్ని పాఠిస్తూ సెట్లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని.. కొవిడ్ ముప్పును నివారించ‌డం నిర్మాత‌ల బాధ్య‌త అని ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించాయి. దీంతో ఇప్పుడు వ‌రుస‌గా షూటింగుల‌కు అన్నిటినీ సిద్ధం చేసుకుంటున్నారు నిర్మాత‌లు. అయితే వీళ్ల‌కు హీరోల రూపంలో బిగ్ పంచ్ ప‌డిపోతోంద‌ని తెలుస్తోంది.

క‌థానాయ‌కులు కానీ క‌థానాయిక‌లు కానీ ఇప్పుడే షూటింగుల‌కు వ‌చ్చేందుకు సుముఖంగా లేర‌ట‌. అస‌లే క‌రోనా ముప్పు అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో సెట్స్ కి రాలేమ‌ని ఖ‌రాకండిగా చెప్పేస్తున్నార‌ట‌. కాస్త త‌గ్గాక పెట్టుకుంటే మంచిద‌ని స‌ల‌హా ఇస్తున్నార‌ట‌. దీనిని బ‌ట్టి నిర్మాత సుఖం కోసం తాము ప్రాణాలు అర్పించ‌లేమ‌ని క్లియ‌ర్ క‌ట్ గా చెప్పేసిన‌ట్టే అవుతోంది. ఇప్ప‌టికే 30-40 శాతం పెండింగ్ షూటింగులు ఉన్నా.. వాటికి స‌హ‌క‌రించేందుకు ఎవ‌రూ సంసిద్ధంగా లేర‌ట‌. కాస్త వేచి చూడాల‌ని చెబుతున్నార‌ట‌. మొత్తానికి హీరోల‌తో పెట్టుకోలేక నిర్మాత‌లు చాలా ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌న్న గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి. అంతా బావుంటే ఎవ‌రైనా హీరోలు అవుతారు.. ఇలాంట‌ప్పుడు రియ‌ల్ హీరోలు అవ్వాలి!! అంటూ సెటైర్లు వేస్తున్నారు కొంద‌రైతే.
Tags:    

Similar News