విలన్ గా శ్రీకాంత్.. కండిషన్స్ అప్లై

Update: 2016-08-18 15:30 GMT
ఒకప్పటి హీరోలందరూ విలన్లు - క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిపోతున్నారు టాలీవుడ్లో. జగపతి బాబు - రాజేంద్ర ప్రసాద్ - సాయికుమార్ - శ్రీకాంత్.. ఇలా జాబితా పెద్దగానే ఉంది. ఐతే క్యారెక్టర్ రోల్స్ కంటే కూడా విలన్ పాత్రలకే ఎక్కువ క్రేజుంటోంది ఈ మధ్య. జగపతి బాబు ‘లెజెండ్’లో విలన్ అవతారం ఎత్తినప్పటి నుంచి ఈ పాత్రలకు క్రేజ్ పెరిగింది. మరో సీనియర్ రాజశేఖర్ కూడా విలన్ వేషం మీద మోజు పడుతున్నాడు. హీరోగా కొనసాగుతున్నప్పుడే క్యారెక్టర్ రోల్స్ చేసిన శ్రీకాంత్ కూడా పవర్ ఫుల్ విలన్ పాత్రల్లో కనిపించాలని తహతహలాడుతున్నాడు.

శ్రీకాంత్ ఇండస్ట్రీ పరిచయమైందే విలన్ గా. కానీ ఆ తర్వాత హీరోగా మారాడు. సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తూ తన ఇమేజ్ మార్చుకున్నాడు. హీరోగా కెరీర్ పూర్తిగా దెబ్బ తినడంతో ఇకపై క్యారెక్టర్.. విలన్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నాడు శ్రీకాంత్. ఐతే తాను విలన్ పాత్ర వేయాలంటే మాత్రం కొన్ని షరతులు ఉండాలంటున్నాడు శ్రీకాంత్. పెద్ద హీరో సినిమాలో అయితేనే విలన్ గా కనిపిస్తాడట. పైగా తన పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉండాలట. అలాగే జగపతి బాబు - ఆది పినిశెట్టి లాంటి వాళ్లు చేసినట్లు స్టైలిష్ విలన్ పాత్ర అయితే మేలట. ఇవన్నీ ఫిల్ చేస్తే తాను విలన్ పాత్రలకు ఓకే చెబుతానంటున్నాడు. ఈ మధ్య ఓ ఆడియో ఫంక్షన్ లో గడ్డం పెంచి రఫ్ లుక్ లో కనిపించాడు శ్రీకాంత్. బహుశా అది విలన్ పాత్రల కోసం ప్రిపరేషన్ లాగే కనిపించింది. మరి శ్రీకాంత్ కోరుకున్న లక్షణాలతో అతడికి ఎవరు విలన్ రోల్ ఆఫర్ చేస్తారో చూడాలి మరి.
Tags:    

Similar News