నితిన్ పెళ్లి తేదీ స‌స్పెన్స్ వీడిందిలా

Update: 2020-07-01 04:30 GMT
మ‌హ‌మ్మారీ విజృంభ‌న‌ షూటింగుల‌కే కాదు పెళ్లిళ్ల‌కు తీవ్ర విఘాతం క‌లిగించింది. ముఖ్యంగా సెల‌బ్రిటీ వెడ్డింగ్స్ పెండింగులో ప‌డిపోయాయి. ప‌లువురు క్రైసిస్ ని ప‌ట్టించుకోకుండా ముందుకెళితే కొంద‌రు హీరోలు మాత్రం పెళ్లి వేడుక‌లపై ఆచితూచి అడుగులేస్తున్నారు. వీళ్ల‌లో నితిన్ వ్య‌వ‌హార‌మే కొంత క‌న్ఫ్యూజ్ చేస్తోంది ఫ్యాన్స్ ని.

హీరోల్లో నిఖిల్ ముహూర్తం దాటిపోనివ్వ‌కుండా పెళ్లాడేశాడు. ఆ త‌ర్వాత రానా ఒక ముహూర్తం ఫిక్స్ చేసుకుని దానికి క‌ట్టుబ‌డి ఉన్నాడు. చెప్పిన తేదీ (ఆగస్టు 8)కే పెళ్లి చేసుకుని తీర‌తానంటున్నాడు. ఇప్పుడు ఆ ఇద్ద‌రిలానే యూత్ స్టాన్ నితిన్ కూడా మైండ్ ని సెట్ చేసుకున్నాడ‌ట‌. నితిన్ తన ప్రియురాలు శాలినిని జూలై 26 న హైదరాబాద్‌లో వివాహం చేసుకోనున్నారు. ఇది ఇరువైపులా కుటుంబాలు నిర్ణయించిన పెళ్లి తేదీ అని తెలుస్తోంది.

ఏప్రిల్ 16 ముహూర్తానికి షాలినిని నితిన్ పెళ్ళాడాల్సిన‌ది అనూహ్యంగా మ‌హ‌మ్మారీ ప్ర‌వేశంతో వాయిదా వేసుకున్నారు. ఆ త‌ర్వాత‌ దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ కావాలని కలలు కన్నా అది సాధ్య‌ప‌డ‌లేదు. అనంత‌రం ప్లాన్ మారింద‌ని వార్త‌లొచ్చాయి. తాజాగా కొత్త వెడ్డింగ్ డేట్ 26 జూలైని స్ట్రాంగ్ గా ఫిక్స‌య్యార‌ని తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలోని ఒక ఫామ్ హౌస్ వేదికగా.. ప్ర‌భుత్వ మార్గదర్శకాలను అనుస‌రిస్తూ ప‌రిమిత బంధుమిత్రుల స‌మ‌క్షంలోనే పెళ్లి జ‌ర‌గ‌నుంది. నితిన్ త‌దుప‌రి `రంగ్ దే` చిత్రీక‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వ్వాల్సి ఉంటుంది.
Tags:    

Similar News