• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సోలో హీరోగా ఈసారైనా...

సోలో హీరోగా ఈసారైనా కలిసొస్తుందా?

By - Tupaki Desk
Update: 2017-06-10 06:06 GMT
హీరోగా నిలదొక్కుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాడు సాయికుమార్ తనయుడు ఆది. ప్రేమకావాలి.. లవ్లీ లాంటి యావరేజ్ సినిమాలతో అతడి కెరీర్ ఓ మోస్తరుగానే ఆరంభమైంది కానీ.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు. అందులోనూ ఈ మధ్య గరం.. చుట్టాలబ్బాయి లాంటి ఫ్లాపులతో కుర్రాడు బాగా వెనుకబడిపోయాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘చుట్టాలబ్బాయి’ నిరాశ పరచడంతో సోలో హీరోగా ఇంకో సినిమా మొదలుపెట్టడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఇంతలో మల్టీస్టారర్ మూవీ ‘శమంతకమణి’లో అవకాశం రావడంతో ఆ సినిమాలో నటించాడు. తాజాగా ఆది సోలో హీరోగా ఓ కొత్త సినిమా మొదలైంది.

విశ్వనాథ్ అరిగెల అనే కొత్త దర్శకుడితో ఆది ఓ సినిమా మొదలుపెట్టాడు. ఉప్పలపాటి చరణ్ తేజ్.. గుర్రం విజయలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిరత్నం సినిమా ‘చెలియా’లో కార్తికి గర్ల్ ఫ్రెండ్ గా నటించిన శ్రద్ధ శ్రీనాథ్ ఈ సినిమాతో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. విశ్వనాథ్ రెండేళ్ల కిందటే ఆదికి ఈ కథ చెప్పాడట. ఈ మధ్యే బౌండెడ్ స్క్రిప్టుతో రావడంతో ఈ సినిమా చేశానని అంటున్నాడు ఆది. కళాతపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వర్ణకమలం’ తరహాలో తన సినిమా ఉంటుందని అంటున్నాడు డెబ్యూ డైరెక్టర్. మరి చాన్నాళ్ల తర్వాత ఆది సోలో హీరోగా నటిస్తున్న ఈ సినిమా అయినా అతడికి సక్సెస్ ఇస్తుందేమో చూడాలి. దీంతో పాటుగా అల్లు అరవింద్.. మరికొందరు నిర్మాతలతో కలిసి బుల్లితెర నటుడు ప్రభాకర్ దర్శకత్వంలో తీయబోయే సినిమాలోనూ ఆది కథానాయకుడిగా నటించనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Aadi 
  • Hero Aadi 
  • TElugu News 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS