అందానికి ఆమె కేరాఫ్ అడ్రెస్ .. అయినా ఎప్పుడూ దిగాలుగా ఉండేదట!
ఒక వైపున శారద .. వాణిశ్రీ, మరో వైపున జయసుధ .. జయప్రద .. శ్రీదేవి గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ తట్టుకుని నిలబడిన కథానాయికగా సుజాత. నటనలో ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తమిళ .. మలయాళ భాషలతో పాటు తెలుగులోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సహజమైన నటన .. సమ్మోహితులను చేసే నవ్వు సుజాత సొంతం. చీరకట్టులో మరింత అందంగా కనిపించే కథానాయికల జాబితాలో ఆమె పేరు ముందువరుసలో కనిపిస్తుంది. అలాంటి సుజాతను గురించి, 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు.
"సుజాత గొప్ప నటి .. కె. బాలచందర్ గారు ఆమెను తెరకు పరిచయం చేశారు. ఆ తరువాత దాసరి నారాయణరావుగారు ఆమెకి అద్భుతమైన లిఫ్ట్ ఇచ్చారు. సుజాత గారి పేరును తలచుకోగానే ముందుగా 'ఏడంతస్తుల మేడ' గుర్తుకు వస్తుంది. ఆ తరువాత గుర్తొచ్చే సినిమా 'చంటి'. ఈ సినిమాలో వెంకటేశ్ తల్లి పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. అప్పట్లోనే ఆమె నాయిక ప్రధానమైన సినిమాలు చేయడం విశేషం. టైటిల్స్ కూడా ఆమె మీదనే పెట్టేసి సినిమాలు తీసేవారు. మా సినిమాల్లో శారద ఎలా ఉండేవారో .. దాసరి నారాయణరావుగారి సినిమాల్లో సుజాత అలా ఉండేవారు.
1980లో ఆమె హీరోయిన్ గా చేసిన 'మానవుడు మహనీయుడు' సినిమాకి నేను పనిచేశాను. అప్పుడు ఆమె నన్ను ఎంతో అభిమానంతో 'పొట్టి పంతులు' అని పిలిచేవారు. ఆ తరువాత కొంతకాలానికి ఆమె నాకు ఎయిర్ పోర్టులో తారసపడ్డారు. నన్ను ఆలస్యంగా గుర్తుపట్టినందుకు ఆమె చాలా బాధపడ్డారు. పాత్రలోకి వస్తే ఆమె అద్భుతంగా చేసేవారు. కానీ మిగతా సమయంలో చాలా దిగాలుగా కనిపించేవారు. అలా ఉండటానికి గల కారణం ఏమిటో తెలిసేది కాదు. ఆమె ఇప్పుడు ఉండి ఉంటే తన వయసుకు తగిన పాత్రలు చేసేవారు .. ఆమె లేకపోవడం దురదృష్టకరం" అని చెప్పుకొచ్చారు.