కియారా 'ఇందూ కీ జ‌వానీ' నుంచి న్యూ వీడియో సాంగ్..!

Update: 2020-11-27 10:52 GMT
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ - ఆదిత్యా సీల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''ఇందూ కీ జ‌వానీ''. కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తోన్న ఈ ప్రాజెక్టుకు అభీర్ సేన్ గుప్తా ద‌ర్శ‌క‌త్వం వహించాడు. ఈ సినిమా డిసెంబ‌ర్ 11న థియేట‌ర్ల‌లో సంద‌డి చేసేందుకు రెడీ అవుతోంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైల‌ర్ విశేషంగా ఆకట్టుకుంది. జీవిత భాగ‌స్వామిని ఎంచుకోవ‌డానికి డేటింగ్ యాప్స్ ను ఆశ్ర‌యించిన ఇందూ గుప్తా అనే యువ‌తికి ఎలాంటి ప‌రిణామాలు ఎదురయ్యార‌నే నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందింది. చిత్ర ప్రమోషన్‌ లో భాగంగా 'ఇందూ కీ జ‌వానీ' టీమ్ 'హీలీనే తూట్ గయీ' అనే వీడియో సాంగ్ విడుదల చేసింది.

మ్యూజిక్ డైరెక్టర్ బాద్ షా స్వరపరిచిన ఈ సాంగ్ లో కియారా అద్వానీ - ఆదిత్యా సీల్ స్టెప్స్ అలరించాయి. ఇందులో కియారా త‌న అందంతో క్యూట్ ఎక్సప్రెషన్స్ తో మెస్మ‌రైజ్ చేసింది. దీనికి బాద్ షా లిరిక్స్ అందించడంతో పాటు ఆస్తా గిల్ తో కలిసి ఆలపించారు. ఆదిల్ షేక్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ అందించాడు. సంతాన కృష్ణన్ రవిచంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. టీ సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో ఎమ్మే ఎంట‌ర్టైన్మెంట్ అండ్ ఎల‌క్రిక్ యాపిల్స్ బ్యాన‌ర్ పై భూషణ్ కుమార్ - దివ్య కోస్లా కుమార్ - కృష్ణ కుమార్ - స్టీపెన్ - నిరంజన్ నిర్మించారు. డిసెంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఇందూ కీ జ‌వానీ' సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.Full View
Tags:    

Similar News