పిక్ టాక్ : అమ్మడిలో ఈ యాంగిల్ కూడా ఉందా...!

Update: 2020-05-01 10:50 GMT
'ఒరు నాల్ కూతు' అనే తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అందాల నివేథా పేతురాజ్. ఆ తర్వాత శ్రీవిష్ణు హీరోగా నటించిన 'మెంటల్ మదిలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా బాగానే అలరించినా ఈ అమ్మడుకు మాత్రం టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది. అయితే ఆ మధ్య వచ్చిన సాయి ధరమ్ తేజ్ 'చిత్ర లహరి'లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత మరో తెలుగు సినిమా 'బ్రోచేవారేవరురా..' సినిమాలో అదరగొట్టింది. దీంతో పాటు అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. నివేథా ఆ సినిమాలో కనిపించింది కొంచెం సేపు అయినా ప్రేక్షకులను కనువిందు చేసింది. ప్రస్తుతం నివేథా పేతురాజ్ రామ్ హీరోగా వస్తోన్న 'రెడ్' సినిమాలో నటిస్తోంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం లాక్‌ డౌన్ కారణంగా సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమాలు షూటింగులు లేకపోవడంతో కుటుంబ సభ్యులతో సమయం గడుపుతున్నారు. కొందరు వర్క్‌ అవుట్స్‌ లో బిజీగా ఉంటే మరి కొందరు వంట గదిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. ఇంట్లోనే ఖాళీగా కూర్చున్న ముద్దుగుమ్మలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. కొంతమంది కుర్రకారుకి వేడి పుట్టించే ఫోటోలను పోస్ట్ చేస్తూ హీట్ పెంచేస్తున్నారు. సినిమా షూటింగులు లేక.. టైమ్ పాస్ అవ్వక.. సోషల్ మీడియా పేజీలలో తమ పోస్టులకు లైక్స్ పెంచుకోడానికి.. అభిమానులను పెంచుకోడానికి తెగ కష్ట పడుతున్నారు.

ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధించినప్పటి నుంచి నివేదా పేతురాజ్ డైలీ తన త్రో బ్యాక్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ వస్తోంది. ఆమె పెట్టే గ్లామరస్ ఫోటోలు రసిక హృదయాలను కలవరపెడుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఇంకెంచెం గ్లామర్ డోస్ పెంచి ఒక త్రో బ్యాక్ ఫోటో బయటపెట్టింది. స్పోర్ట్స్ బ్రా ధరించి బాక్సింగ్ గ్లోవ్స్‌ లో కనిపించిన నివేదాని చూసి గొంతు తడుముకొని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వేడి పుట్టించేలా ఉండటం నా తప్పా అన్నట్లు ఫోజ్ ఇచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటి దాకా సంప్రదాయబద్ధమైన అమ్మాయి క్యారెక్టర్స్ ఇస్తూ వస్తున్న దర్శకనిర్మాతలు ఈ అమ్మడిని ఈ యాంగిల్ లో చూపించాలని ఎందుకు అనుకోలేదో మరి. ఈ ఫోటో చూస్తే వారికి ఖచ్చితంగా అలాంటి ఆలోచన వస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే మన తెలుగు నిర్మాతలు ఈ మధ్య నివేథా పేతురాజ్ ని నటింపచేయడానికి క్యూ కడుతున్నారట. రాబోయే రోజుల్లో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసే అవకాశాలున్నాయంటున్నారు.

Tags:    

Similar News