బాలు కోసం.. సూపర్‌ స్టార్‌ ఘట్స్‌ కు హ్యాట్సాఫ్‌

Update: 2020-09-27 01:43 GMT
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిని ఎవరు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన లేని లోటు ఎవ్వరు తీర్చలేరు అంటూ స్టార్స్‌ సూపర్‌ స్టార్స్‌ సామాన్యులు ఇలా అంతా కూడా సోషల్‌ మీడియా ద్వారా మాట్లాడుతూ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసి కుటుంబ సభ్యులకు సోషల్‌ మీడియా ద్వారానే సంతాపంను తెలియజేశారు. కరోనా సమయం అవ్వడం వల్ల చాలా మంది బాలు గారిని కడసారి చూడలేక పోయారు. ముఖ్యంగా  టాలీవుడ్‌ సినీ ప్రముఖులు ఆయన్ను కడసారి చూడలేక పోయామే అని చాలా బాధపడి ఉంటారు అనడంలో సందేహం లేదు. చెన్నైలో బాలు గారు ఉన్న కారణంగా ఆయన చివరి చూపుకు తమిళ స్టార్స్‌ కొంత మంది వెళ్లారు.

బాలు గారి అంత్యక్రియల్లో కేవలం తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ మాత్రమే పాల్గొన్నారు. బాలు గారిని ఖననం చేసిన ఫామ్‌ హౌస్‌ వద్దకు భారీ ఎత్తున జనాలు వస్తారనే విషయం తెలిసి కూడా కరోనాను లక్ష్యపెట్టకుండా సూపర్‌ స్టార్‌ విజయ్‌ అంత్యక్రియల్లో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంత్యక్రియల సమయంలో బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ ను పక్కన ఉండి ఓదార్చారు. కార్యక్రమం పూర్తి అయ్యే వరకు అక్కడే ఉన్న విజయ్‌ ఆ తర్వాత అక్కడ నుండి వెళ్లి పోయారు. విజయ్ వచ్చిన విషయం తెలిసి వేలాది మంది అభిమానులు అక్కడకు చేరుకున్నారు. దాంతో వారిని కంట్రోల్‌ చేసి విజయ్‌ ను పంపించేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. అంత మంది జనాలు మరియు కరోనా ను లక్ష్య పెట్టకుండా బాలు అంత్యక్రియలకు హాజరు అయిన విజయ్‌ కి హ్యాట్సాఫ్‌ అంటూ అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.
Tags:    

Similar News