• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అవును.. అతను మెగాఫోన్...

అవును.. అతను మెగాఫోన్ పడుతున్నాడు

By - Tupaki Desk
Update: 2017-01-13 16:17 GMT
ప్రస్తుతం టాలీవుడ్లో రైటర్ టర్న్డ్ డైరెక్టర్లకు మాంచి డిమాండ్ ఉంది. త్రివిక్రమ్ దగ్గర్నుంచి కొరటాల శివ వరకు గత పుష్కర కాలంలో ఎంతోమంది రచయితలు దర్శకులుగా మారారు. మంచి స్థాయిని అందుకున్నారు. ఏటా ఐదారుగు రచయితలైనా మెగా ఫోన్ పడుతున్నారు. ఈ జాబితాలోకి కొత్తగా చేరబోతున్న పేరు.. హర్షవర్ధన్. ముందు నటుడిగా మంచి పేరు సంపాదించిన హర్షవర్ధన్.. ఇష్క్ - మనం - గుండెజారి గల్లంతయ్యిందే లాంటి సినిమాలతో రచయితగాతనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను దర్శకుడిగా మారే అవకాశాలున్నట్లు రెండేళ్లుగా ప్రచారం జరుగుతోంది.

హర్షకు సన్నిహితుడైన నితినే అతడి తొలి సినిమా హీరో కావచ్చన్నారు కానీ.. నితిన్ అందుబాటులోకి రాలేదు. ఐతే రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేయాలని కూడా హర్షవర్ధన్ అనుకోవట్లేదు. అతనో వైవిధ్యమైన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రానికి హీరో ఎవరన్నది ఇంకా ఖరారవ్వలేదు. హీరోయిన్‌గా మాత్రం యాంకర్ శ్రీముఖి సెలక్టయినట్లు సమాచారం. ముందు చిన్నా చితకా పాత్రలు చేస్తూ వచ్చిన శ్రీముఖికి ఈ మధ్య మంచి అవకాశాలే లభిస్తున్నాయి. అవసరాల శ్రీనివాస్ సినిమా ‘బాబు బాగా బిజీ’లో ఆమె వన్ ఆఫ్ ద హీరోయిన్స్. ఇప్పుడు హర్షవర్ధన్ సినిమాలో లీడ్ హీరోయిన్ రోలే చేస్తోందట. మరి రచయితగా మెప్పించిన హర్షవర్ధన్.. దర్శకుడిగా ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Harshvardhan 
  • Director 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS