• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హరీష్ శంకర్ - పవన్.. ఓ...

హరీష్ శంకర్ - పవన్.. ఓ గుడ్ న్యూస్!

By - Tupaki Desk
Update: 2022-11-21 12:30 GMT
టాలీవుడ్ మాస్ డైరెక్టర్స్ లో ఒకరైన హరి శంకర్ గబ్బర్ సింగ్ సినిమాతో ఒక్కసారి అగ్ర దర్శకుల లిస్ట్ లో చేరిపోయాడు ఆ తర్వాత అతను మినిమం రేంజ్ లో సక్సెస్ లో అనుకున్నాడు. కానీ మళ్ళీ గబ్బర్ సింగ్ లాంటి సాలీడ్ సక్సెస్ అయితే పడలేదు. అందుకే పవన్ కళ్యాణ్ తో మరోసారి సినిమా చేస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనుకున్నట్లే గత తేడాది భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ కూడా చెప్పేసి స్క్రిప్ట్ లాక్ చేసుకున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చేసింది. అయితే పవన్ కళ్యాణ్ అనుకోకుండా మధ్యలోకి బీమ్లా నాయక్ సినిమాను తీసుకురావడంతో ఆ ప్రాజెక్టు వాయిదా పడింది. అలాగే ఇప్పుడు రాజకీయ కారణాల వలన పవన్ కళ్యాణ్ ఆ ప్రాజెక్టును మొదలుపెట్టలేకపోతున్నాడు.

ఒక్క సినిమా షూటింగ్ పూర్తి చేయడమే కష్టంగా మారిన సమయంలో ఇప్పుడు హరిహర వీరమల్లతో పాటు భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ కూడా చేయడం కుదరని పని.

రాజకీయాలకు సమయం వెచ్చించలేము అని పవన్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో చాలా కాలంగా అలాంటి వార్తలు వైరల్ అవుతుండటంతో ఇప్పుడు హరీష్ శంకర్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. మొత్తానికి మైత్రి పవన్ హరీష్ కాంబినేషన్ పై ఆశలు చిగురించాయి అనేలా ఒక ట్వీట్ వైరల్ అవుతూ ఉండడంతో. హరిష్ శంకర్ ఆ విషయంపై సరదాగా స్పందించారు.

దీన్ని బట్టి కాంబినేషన్ అయితే మళ్ళీ లైన్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మరో టాక్ ప్రకారం భవదీయుడు భగత్ సింగ్ స్క్రిప్ట్ కాకుండా హరీష్ లైన్లోకి మరొక కథను తీసుకువచ్చినట్లు కూడా టాక్ వస్తోంది. అసలైతే మొన్నటి వరకు కూడా హరీష్ శంకర్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది అని కథనాలు వెలుపడ్డాయి.

కానీ స్క్రిప్ట్ నచ్చక పోవడంతో సల్మాన్ ఖాన్ రిజెక్ట్ చేసినట్లు కూడా మరికొన్ని కామెంట్స్ వినిపించాయి. మరి ఇప్పుడు హరిష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఎలాంటి కథను లాక్ చేసుకున్నాడో తెలియాలి అంటే మరికొంతకాలం ఆగాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • HarishShankar 
  • PawanKalyan 
  • MythriMovieMakers 
  • GabbarSingh 
  • BhaavadeyuduBhagatSingh 
  • BheemlaNayak 
  • CinemaShooting 
  • HariHaraVeeraMallu 
  • MovieNews 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS