రామయ్యా వస్తావయాకు లాభాలొచ్చాయట
దిల్ రాజు బేనర్ లో వచ్చిన పెద్ద డిజాస్టర్ ‘రామయ్యా వస్తావయ్యా’. ఆయన బేనర్ లో అంతకుముందు కూడా ఫ్లాపులు వచ్చాయి కానీ.. ఇలాంటి డిజాస్టర్ మాత్రం ఎప్పుడూ తీయలేదు. ఐతే ‘రామయ్యా వస్తావయ్యా’ అంత పెద్ద ఫ్లాప్ అయినప్పటికీ.. ఆ సినిమాకు నిర్మాత దిల్ రాజు మంచి లాభాలు అందుకున్నాడని చెబుతున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. అదెలా సాధ్యమో హరీష్ మాటల్లోనే విందాం పదండి.
‘‘రామయ్యా వస్తావయ్యా ఫ్లాపే. కానీ.. ఆ సినిమాకు రాజు గారు టేబుల్ ప్రాఫిట్స్ అందుకున్నారు. సినిమాను లిమిటెడ్ బడ్జెట్ లో తీశాం. వేగంగా కూడా పూర్తి చేశాం. సినిమా మీద మంచి హైప్ ఉండటంతో మంచి బిజినెస్ జరిగింది. రాజుకు లాభాలొచ్చాయి. కానీ సినిమా బాగా ఆడకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లకు లాస్ వచ్చింది. ఐతే రాజు వాళ్లనలా వదిలేయలేదు. ‘ఎవడు’ సినిమాతో కాంపెన్సేజ్ చేశాడు’’ అని చెప్పాడు హరీష్.
రామయ్యా వస్తావయ్యా లాంటి ఫ్లాప్ తర్వాత కూడా మళ్లీ రాజు అవకాశమివ్వడం గురించి మాట్లాడుతూ.. ‘‘సినిమా ఆడకపోయినా నా మీద రాజుగారికి కాన్ఫిడెన్స్ ఉంది. నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. మళ్లీ సినిమా చేద్దామన్నారు. ఆయన స్క్రిప్టునే నమ్ముతారు. ఈ డైరెక్టర్ హిట్టిచ్చాడా? ఫ్లాపిచ్చాడా అని ఆలోచించరు. సుబ్రమణ్యం ఫర్ సేల్ కథ వేరే వాళ్లకు చెప్పాను. కానీ అమెరికాలో షూట్ చేయడంపై అభ్యంతరాలు చెప్పారు. కానీ రాజు మాత్రం అమెరికాలో షూట్ చేయకుంటే సినిమా తీయడమే వేస్ట్ అన్నారు. మేం అడిగినంత బడ్జెట్ ఇచ్చి సినిమా పూర్తి చేశారు. త్వరలో ఆయనతో మరో సినిమా చేద్దామనే ఆలోచనలో ఉన్నాం’’ అని హరీష్ చెప్పాడు.