వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో మాస్ డైరెక్టర్...!

Update: 2020-05-14 12:10 GMT
హరీష్ శంకర్ 'షాక్' సినిమాతో డైరెక్టర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసాడు. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో 'మిరపకాయ్' తీసి డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘గబ్బర్‌సింగ్’ చిత్రంతో బ్లాక్‌ బస్టర్ హిట్ రుచి చూసాడు. అప్పటి వరకు ప్లాప్స్‌ లో ఉన్న పవన్ కల్యాణ్‌ కి.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌ కి ఈ చిత్రంతో ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా ఇండస్ట్రీని కూడా షేక్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్లో 28వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడని హరీష్ శంకర్ ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పుడు పవన్ - హరీష్ - దేవిశ్రీ కలయికలో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హరీష్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలున్నాయి. అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యేలోపు హరీష్ శంకర్ మరో సినిమా చేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన హరీష్.. పవన్ కళ్యాణ్ తో సినిమా కంప్లీట్ అయ్యే వరకు మరో సినిమా చేసే ఆలోచన లేదని చెప్పాడట. పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నానని.. ఇప్పటికే స్టోరీ లైన్ కి పవన్ ఇంప్రెస్స్ అయ్యాడని.. ఫ్యాన్స్ పవర్ స్టార్ నుండి ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో అలాంటి మూవీ తీయబోతున్నాని చెప్పుకొచ్చాడట. అయితే సమయం ఉంటే ఒక వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారట. ప్రస్తుతం వెబ్ కంటెంట్ కి ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు నటీనటులు ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే క్రిష్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ భాస్కర్ వెబ్ సిరీస్ లలో అడుగుపెట్టారు. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా అదే ఆలోచన ఉన్నాడనే న్యూస్ స్ప్రెడ్ అయింది. పవన్ ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాలను కంప్లీట్ చేసే లోపు వెబ్ సిరీస్ తీస్తాడేమో. ఇదే కనుక నిజమైతే ఎలాంటి వెబ్ సిరీస్ హరీష్ తీస్తాడో చూడాలి.
Tags:    

Similar News