స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఒక వైపు స్టార్ హీరోలతో ఇతర బ్యానర్ లలో సినిమాలు చేస్తూ మరో వైపు సుకుమార్ రైటింగ్ అనే సంస్థపై సినిమాలు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే రెండు సినిమాలను నిర్మించిన సుకుమార్ ప్రస్తుతం మరో రెండు సినిమాలను నిర్మిస్తున్నాడు. సుకుమార్ సొంతంగా నిర్మించకుండా, మరో నిర్మాత భాగస్వామ్యంలో సినిమాలను నిర్మిస్తూ ఉంటాడు. వైష్ణవ్ తేజ్ మూవీని మైత్రి వారితో - నాగశౌర్య మూవీని శరత్ మరార్ తో కలిసి నిర్మించబోతున్నాడు. ఇదే విధంగా మరో దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఇతర నిర్మాతలతో కలిసి వరుసగా సినిమాలను నిర్మించాలని భావిస్తున్నాడు.
హరీష్ శంకర్ గతంలోనే నిర్మాతగా ఒక చిత్రాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు చేశాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇటీవలే దర్శకుడిగా హరీష్ శంకర్ సినిమాను మొదలు పెట్టాడు. ఒక వైపు వరుణ్ తేజ్ తో 'వాల్మీకి' చిత్రాన్ని తెరకెక్కిస్తూనే మరో వైపు తన నిర్మాణంలో ఒక చిత్రాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆ సినిమాకు స్క్రిప్ట్ సహకారం అందించనున్నట్లుగా కూడా తెలుస్తోంది.
హరీష్ శంకర్ తో సినిమా నిర్మాణ భాగస్వామిగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేష్ కోనేరు వ్యవహరించబోతున్నాడు. అందుకు సంబంధించిన సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ కోనేరు మరియు హరీష్ శంకర్ లు కలిసి వరుసగా సినిమాలు నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. వీరిద్దరి కాంబోలో మూవీని అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు. కొత్త దర్శకుడితో ఆ చిత్రం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.