పవర్ స్టార్ డెడికేషన్ లెవెల్స్.. పీక్స్!

Update: 2021-04-02 10:30 GMT
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' మూవీ ప్రారంభించినప్పటి నుండి పవర్ స్టార్ అభిమానులలో సందడి మొదలైంది. ఎందుకంటే వకీల్ సాబ్ విడుదలకు రెడీ అయిందో లేదో ఆ వెంటనే వరుస సినిమాలను ప్రకటించాడు పవన్. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత 'వకీల్ సాబ్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఐతే పవన్ కళ్యాణ్.. మరోవైపు వేగంగా తదుపరి సినిమాలను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ టైం ఓ పీరియడిక్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. 'హరిహర వీరమల్లు' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఇటీవలే విడుదల చేశారు మేకర్స్. ఏ విషయంలో ఎలా ఉన్నా.. పవర్ స్టార్ సినిమా విషయానికి వచ్చేసరికి చాలా డెడికేటెడ్ గా ఉంటాడు.

ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాకోసం విపరీతంగా కష్టపడుతున్నాడు పవన్. తాజాగా ఆయన యాక్షన్ సీక్వెన్స్ కోసం ఉదయం ఏడు గంటలకు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూస్తే ఖచ్చితంగా పవన్ డెడికేషన్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. షౌలిన్ వారియర్ మోంక్స్ ద్వారా పవన్ షౌలిన్ విద్యలో శిక్షణ పొందుతుండటం మనం చూడవచ్చు. పొద్దున్నే లేచి యాక్షన్ సీక్వెన్స్ కోసం.. ఆ క్యారెక్టర్ కు న్యాయం చేయడంకోసం పవన్ కష్టపడుతున్నట్లు చిత్రయూనిట్ చెబుతున్నారు. ఈ సినిమాకు యాక్షన్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసి అర్ధం చేసుకోవచ్చు. డైరెక్టర్ క్రిష్ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారని. ఫోటోలలో పవన్ బ్లాక్ పూమా క్యాజువల్స్ ధరించడం చూడొచ్చు. అలాగే పవన్ ఇదివరకటి లుక్కులా కాస్త సన్నబడినట్లు కనిపించడం విశేషం. ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తుండగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
Tags:    

Similar News