భజ్జీ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా సాగేనా...?
భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత తన సెకెండ్ ఇన్నింగ్స్ ను సినీ ఇండస్ట్రీలో స్టార్ట్ చేశారు. క్రికెట్ గ్రౌండ్ లో తన అద్భుత బౌలింగ్ తో ఎన్నో విజయాలలో కీలక పాత్ర పోషించిన భజ్జీ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ప్రధాన పాత్ర పోషించారు. హర్భజన్ సింగ్ హీరోగా ‘ఫ్రెండ్ షిప్’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో 'బిగ్ బాస్' ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. ఇక తమిళ నటుడు సతీష్ కూడా కనిపించనున్నారు. ఈ సినిమాకు కి జాన్ పాల్ రాజ్ మరియు శ్యామ్ సూర్య దర్శకత్వం వహించారు. సీన్ టొవా స్టూడియోస్ మరియు సినీ మాస్ స్టూడియోస్ బ్యానర్స్ పై జేపీఆర్ అండ్ స్టాలిన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా విశేష స్పందన తెచ్చుకుంది. కాగా ఈ రోజు హర్భజన్ సింగ్ బర్త్ డే సందర్భంగా మరో పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాని తమిళ తెలుగు హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నారని సమాచారం.
ఇదిలా ఉండగా హర్భజన్ సింగ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ పై సినీ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన డాక్యూమెంటరీతో వస్తేనే ఎవరూ చూడలేదు. ఇప్పుడు భజ్జీ మాత్రం హీరో అంటూ వస్తే జనాలు చూస్తారా అని వ్యాఖ్యానిస్తున్నారు. హీరోలకే దిక్కు లేదు మళ్ళీ క్రికెటర్స్ కూడా సినిమాలు చేస్తున్నారా అంటూ పెదవి విరుస్తున్నారు. పోనీ హర్భజన్ ఏమైనా సచిన్ - ధోనీల రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న క్రికెటరా అంటే అదీ కాదు. అందులోనూ సినీ ఇండస్ట్రీలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాకి థియేటర్స్ దొరకడం అంటే కష్టమనే చెప్పాలి. దీంతో ఈ సినిమాని డిజిటల్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేసుకోవాల్సి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకి 'ఫ్రెండ్ షిప్' అనే క్యాచీ టైటిల్ పెట్టడంతో ఈ సినిమాని జనాల దాకా తీసుకొని పోవడం ఈజీ అవుతుందనుకోవచ్చు. ఏదేమైనా తన బౌలింగ్ తో భారత్ కి ఎన్నో విజయాలు అందించిన హర్భజన్ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.