• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాకెట్ లాంటి హీరో రామ్

రాకెట్ లాంటి హీరో రామ్

By - Tupaki Desk
Update: 2021-05-15 03:30 GMT
తెలుగు తెరపై ఆకట్టుకునే హ్యాండ్సమ్ హీరోల్లో రామ్ ఒకరు. చూడటానికి ఎర్రగా .. బుర్రగా కనిపిస్తాడు. సున్నితంగా .. సుకుమారంగా అనిపిస్తాడు. అందువల్లనే అతణ్ణి అభిమానులు చాక్లెట్ బాయ్ అని పిలుచుకుంటారు. చూస్తుండగానే ఈ లవర్ బాయ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ పదిహేనేళ్లలో రామ్ నటనలో ఆరితేరిపోయాడు. 'దేవదాసు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన రామ్, తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు. యూత్ నుంచి విపరీతమైన ఫాలోయింగ్ ను చేజిక్కించుకున్నాడు.

'రెడీ' సినిమాతోనే రామ్ కనిపించేంత సెన్సిటివ్ కాదనే విషయం ఆడియన్స్ కి అర్థమైపోయింది. 'కందిరీగ'తో  యాక్షన్ .. కామెడీ చేయడంలో కుర్రాడు తడబడక పోవడాన్ని వాళ్లు గమనించారు. ఇక డాన్సుల విషయంలో వంకబెట్టవలసిన అవసరం లేదని స్పష్టమైంది. డాన్సుల పరంగా ఎన్టీఆర్ .. బన్నీ .. చరణ్ ల తరువాత రామ్ తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇక కథ ఏదైనా దానిని పూర్తి ఎనర్జీతో నడిపించడం రామ్ స్పెషాలిటీ అయింది. కథను నత్తనడక నడిపించడం .. సన్నివేశాలను నాన్చడం అలవాటు లేని రామ్, రాకెట్ లా దూసుకుపోయాడు.

మొదటి నుంచి కూడా రామ్ యూత్ కి నచ్చే కథలకు .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను జోడిస్తూ, ఈ రెండు వర్గాల ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు కూడా ఉండేలా చూసుకుంటూ, వాళ్ల నుంచి కూడా ఓట్లను సంపాదించుకుంటూ వస్తున్నాడు. అలాంటి రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో తనలోని మాస్  యాంగిల్ ను పూర్తిస్థాయిలో ఆవిష్కరించాడు. వసూళ్లను పరుగులు తీయించే హీరోల జాబితాలో తాను కూడా చేరిపోయాడు. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో రామ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రోజున ఆయన బర్త్ డే .. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ .. మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిద్దాం!  
Tags:    
  • Happy Birthday Ram Pothineni 
  • Hbd Ram 
  • Ram Pothineni 
  • Ram Pothineni Birthday Celebrations 
  • Tollywood 
  • Telugu News 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS