• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వాటే కామెంట్: కెమెరాకు...

వాటే కామెంట్: కెమెరాకు నాని అంటే అసహ్యం

By - Tupaki Desk
Update: 2016-02-17 05:30 GMT
కెమెరాకే మాటలొస్తే నానిని చూసి అది కచ్చితంగా అసహ్యించుకుంటుంది అంటున్నాడు అతడితో ‘కృష్ణగాడి ప్రేమ గాథ’ సినిమా తీసిన డైరెక్టర్ హను రాఘవపూడి. నాని లాంటి నటుణ్ని తానెక్కడా చూడలేదని.. అతడితో పని చేసిన ఏ దర్శకుడైనా మైకంలో పడిపోతాడని అన్నాడు హను. కెమెరాకు ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వని నటుడు నాని అని.. ముందు కెమెరా ఉందన్న విషయమే అతడికి గుర్తుండదని.. నాని లాంటి నటుడితో ఎన్ని సినిమాలైనా చేయాలనిపిస్తుందని హను అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో తన హీరో మీద ప్రశంసల జల్లు కురిపించాడు హను.

‘‘ఒక అందమైన ప్రకృతి దృశ్యం ఏదైనా చూస్తే అది అంత సులువుగా మన మనసును వదిలిపోదు. నాని నటన కూడా అలాంటిదే. అతడి నటన, హావభావాలు అంత సులువుగా మనల్ని వీడిపోవు. నాని లాంటి నటుణ్ని నేనెక్కడా చూడలేదు. ఉన్నట్లుండి ఓ స్టన్నింగ్ ఎక్స్ ప్రెషన్ ఇస్తాడు. అది చూసి మతి పోతుంది. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమా చేస్తూ అతడి హావభావాలు చూసి ఎన్నిసార్లు షాకయ్యానో.. ఎంత ఆశ్చర్యపోయానో మాటల్లో చెప్పలేను.

మన ముందు కెమెరా ఉందంటే కచ్చితంగా కొంచెం తడబడతాం. ఓ ఫొటో తీస్తున్నా సరే మన బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. కానీ నాని మాత్రం తన ముందు కెమెరా ఉందన్న సంగతే గుర్తించడు. అసలు కెమెరాకు అతను రెస్పెక్ట్ ఇవ్వడు. ఒకవేళ కెమెరాకే గనక మాటలొస్తే అతణ్ని అది అసహ్యించుకుంటుంది. నానికి ఇదంతా పుట్టుకతో వచ్చిందా.. లేదా అతనే డెవలప్ చేసుకున్నాడా తెలియదు కానీ.. అతను అసాధారణమైన నటుడు. భవిష్యత్తులో ఇంకా చాలా గొప్ప స్థాయికి వెళ్తాడు. అద్భుతాలు చేస్తాడు’’ అంటూ నానిని ఆకాశానికెత్తేశాడు హను.
Tags:    
  • Hanu Raghavapudi 
  • Nani 
  • Telugu News 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS