పర్సనల్‌ ఫొటోల లీక్‌ పై హన్సిక రియాక్షన్‌

Update: 2019-01-24 05:05 GMT
కొన్ని రోజుల క్రితం అక్షర హాసన్‌ ప్రైవేట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెల్సిందే. అవి లీక్‌ అయ్యాయంటూ అక్షర హాసన్‌ పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చింది. ఆ వివాదం ఇంకా కొనసాగుతున్న సమయంలోనే సౌత్‌ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన హన్సిక పర్సనల్‌ ఫొటోలు లీక్‌ అయిన విషయం తెల్సిందే. హన్సిక బికినీ ఫొటోలు మరియు కొన్ని ప్రైవేట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో గత రెండు మూడు రోజులుగా సందడి చేస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించింది.

తన ప్రైవేట్‌ ఫొటోలు లీక్‌ అవ్వడంపై హన్సిక స్పందిస్తూ... తన ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందని, తన ఫోన్‌ తో పాటు ట్విట్టర్‌ అకౌంట్‌ కూడా హ్యాక్‌ అయ్యిందని, దయచేసి తన ట్విట్టర్‌ అకౌంట్‌ లో వచ్చే మెసేజ్‌ లను పోస్ట్‌ లను గురించి పట్టించుకోవద్దని కోరింది. నా ఫోన్‌ లో ఉన్న కొన్ని పర్సనల్‌ ఫొటోలను హ్యాకర్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తన ఫోన్‌ డేటా మరియు ట్విట్టర్‌ అకౌంట్‌ కు సంబంధించిన రికవరీ బ్యాక్‌ అండ్‌ వర్క్‌ జరుగుతుంది. త్వరలోనే అది పూర్తి చేసి, ఆ తర్వాత హ్యాకర్స్‌ పై లీగల్‌ చర్యలు తీసుకుంటానంటూ హన్సిక చెప్పుకొచ్చింది. ఇలా సెలబ్రెటీల ఫోన్స్‌ మరియు సోషల్‌ మీడియా అకౌంట్స్‌ హ్యాక్‌ అవుతున్న నేపథ్యంలో టెన్షన్‌ తో ఫోన్‌ లో చాలా మంది తమ ప్రైవేట్‌ ఫొటోలను తీసేస్తున్నారు.


Full View
Tags:    

Similar News