నా వయసెంతో తెలుసా అంటోంది

Update: 2015-07-21 12:17 GMT
అమ్మాయిల్ని వయసెంతో అడక్కూడదు. అబ్బాయిల్ని జీతమెంతో అడక్కూడదు అంటారు. కానీ పాలబుగ్గల బ్యూటీ హన్సిక మాత్రం మనం అడక్కుండానే వయసెంతో చెప్పేస్తోంది. అసలు నా వయసు ఎంతనుకుంటున్నారు అని ప్రశ్న తనే వేసి.. వయసు చెబుతుండటం విశేషం. ఇంతకీ ఆమె వయసు ప్రస్తావన ఎందుకొచ్చిందీ అంటే.. పెళ్లిమాట ఎత్తినందుకే. రెండేళ్ల కిందటే శింబుతో హన్సిక పెళ్లి వ్యవహారం గురించి చర్చ జరిగింది. ఐతే శింబుతో బ్రేకప్ అయిపోవడంతో మళ్లీ కెరీర్ మీద దృష్టిపెట్టింది హన్సిక. కొన్నాళ్లు సైలెంటుగా ఉన్ను మీడియా వాళ్లు ఈ మధ్య మళ్లీ పెళ్లి మాట ఎత్తారు.

దీంతో ఫ్రస్టేట్ అయిపోతూ.. ఇంతకీ నా వయసెంతనుకుంటున్నారు అంటూ ఎదురు ప్రశ్నలు మొదలెట్టింది హన్సిక. ‘‘నాకింకా 23 ఏళ్లే తెలుసా? నా వయసు అమ్మాయిలు మీ ఇంట్లో ఉంటే పెళ్లి చేసేస్తారా? మరి నన్ను మాత్రం ఎందుకు తొందర పెడుతున్నారు. అమ్మాయిలు బాగా చదువుకోవాలని.. ఏదో ఒక ఉద్యోగం చేయాలని.. తమ కాళ్ల మీద నిలబడాలని ఇప్పటి తల్లిదండ్రులు భావిస్తున్నారు. అందుకే వెంటనే పెళ్లి చేసేయాలని తొందరపడట్లేదు. మామూలు అమ్మాయిలే 23 ఏళ్లకు పెళ్లి చేసుకోవట్లేదు. మరి నన్నెందుకు తొందర పెడుతున్నారు? నిజానికి నాదిప్పుడు చదువుకునే వయసు. పెళ్లికింకా చాలా టైముంది. కాబట్టి ఇంకోసారి నా దగ్గర పెళ్లి ఊసు ఎత్తొద్దు’’ అని ముగించింది హన్సిక.
Tags:    

Similar News