అందాల గాజు బొమ్మ కాలు జారితే అంతేగా..!
ఆపిల్ బ్యూటీ హన్సిక ఇంతకీ ఏమైపోయింది? ఇటీవల అస్సలు చడీచప్పుడు లేనే లేదు? అసలు నటిస్తోందా లేదా? చాలా చిన్న వయసులో బాలనటిగా పరిచయమై అటుపై కథానాయిక అయ్యింది. టీనేజీ మిసమిసలతో కుర్రకారు మనసు దోచింది. ఎర్లీ ఏజ్ లో వచ్చి ఇప్పుడు ఔట్ డేటెడ్ అయ్యింది. ఇంతకీ ఇప్పుడు ఏమైనట్టు? అంటే డీప్ గా మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే.
అల్లు అర్జున్ సరసన దేశముదురులో నటించిన హన్సిక ఆ తర్వాత మంచు కాంపౌండ్ లో స్థిరపడి వరుస అవకాశాలు అందుకుంది. కానీ అవేవీ తన కెరీర్ కి పెద్ద స్థాయిలో కలిసి రాలేదు. ఆ క్రమంలోనే తమిళంలో అవకాశాలు అందుకుని అక్కడ స్థిరపడింది.
రెండేళ్ల క్రితం శింబుతో ప్రేమాయణానికి బ్రేక్ పడిపోయాక కెరీర్ పరంగా ఎందుకనో స్లో అయ్యింది. కానీ ఇంతలోనే తిరిగి కెరీర్ ని ట్రాక్ లో వేయాలని గట్టి ప్లాన్ వేసింది.. కానీ ఛాన్సులైతే రాలేదు. ఇటీవల తెలుగులోనూ ఓ సినిమాకి కమిటైందన్న టాక్ ఇటీవల వినిపించింది. తమిళంలో మహా అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. సిగరెట్ ఊదేసే మాతాజీ పాత్రలో హన్షిక మెరిపించనుంది. ఇది తన కెరీర్ 50వ చిత్రం. యు.ఆర్.జమీల్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో రిలీజ్ కానుంది. ఎట్సెటెరా ఎంటర్ ఐటన్మెంట్ మహా ప్రొడక్షన్ బ్యానర్లో మాథి అజగన్ నిర్మించారు. ఈ చిత్రంలో హన్సిక మోత్వానీ మాజీ లవర్ కోలీవుడ్ స్టార్ శింబు ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. 2019 లో కొన్ని సన్నివేశాల కోసం ఈ జంట కలిసి నటించాక మహమ్మారీ వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం పెండింగ్ చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉందిట.
అలాగే హన్సిక ఇటీవల మజా ఆగయా!అంటూ పాప్ ఆల్బమ్ లో నటించింది. గురుచౌదరి ఈ సింగిల్ ని ఆలపించగా సారెగామా మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్ లో విడుదలైంది. తాజాగా ఇన్ స్టాలో హన్షిక షేర్ చేసిన ఫోటోషూట్ వైరల్ గా మారింది. ఈ ఫోటోల్లో హన్సిక ఎంతో యంగ్ గా ఫిట్ గా కనిపిస్తోంది. లేట్ ఏజ్ అయినా ఇంకా టీనేజీ లుక్ తో అలరిస్తోంది. అద్దంలా మెరుస్తన్న ఆ నేలపై హీల్స్ జారితే అంతేగా! అంటూ అభిమానులు ఈ ఫోటోలకు వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు. ఇన్నేళ్లయినా ఆపిల్ బ్యూటీ వన్నె తరగని అందానికి స్మైల్ కి సలామ్ గులాం అనేస్తున్నారు.