మల్టీస్టారర్స్ పై మక్కువ చూపిస్తున్న హ్యాండ్సమ్ హంక్..!
'లీడర్' సినిమాతో దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన కథలు, విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. పాత్ర నచ్చితే అది నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ అయినా.. మరో హీరోతో కలిసి నటించే మల్టీస్టారర్ అయినా రానా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
'బాహుబలి' సినిమాలో ప్రతినాయకుడు భల్లాల దేవుడుగా నటించిన రానా దగ్గుబాటి.. మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించడానికి మక్కువ చూపిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలు హిందీ తమిళ మల్టీస్టారర్స్ లో నటించిన దగ్గుబాటి వారసుడు.. ఈ క్రమంలో మరికొన్ని మల్టీస్టారర్ ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలసి 'భీమ్లా నాయక్' చిత్రంలో నటిస్తున్నారు రానా.
'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డ్యానీ శేఖర్ పాత్రలో రానా కనిపించనున్నారు. మాతృకలో ఈ పాత్రను హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించారు. తెలుగు రీమేక్ ను పవన్ కళ్యాణ్ సోలో సినిమా అనుకునేలా టైటిల్ పెట్టి, ప్రమోషన్స్ చేస్తున్నప్పటికీ.. ఇది మల్టీస్టారర్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి త్వరలోనే రానాకు సంబంధించిన కంటెంట్ విడుదల కానుంది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న 'భీమ్లా నాయక్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
లేటెస్టుగా తన బాబాయ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి రానా దగ్గుబాటి ఓ వెబ్ సిరీస్ లో నటించాడని పచ్చ జెండా ఊపారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ కోసం వీరిద్దరూ ఈ సిరీస్ చేస్తారని సురేష్ బాబు స్వయంగా వెల్లడించారు. విభిన్నమైన కథాంశంతో రూపొందే ఈ సిరీస్ 2022 లో సెట్స్ పైకి వెళ్తుందని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత తెలిపారు. ఈ వెబ్ సిరీస్ ని తెలుగు - హిందీతో పాటుగా అన్ని ప్రధాన భాషల్లోనూ విడుదల చేయనున్నారు.
ఏదేమైనా దగ్గుబాటి హీరోల మల్టీస్టారర్ చూడాలని ఆశపడిన అభిమానులను.. ఇలా వెబ్ సిరీస్ తో బాబాయ్ - అబ్బాయ్ అలరించనున్నారు. ఇకపోతే బావబామర్దులు రానా - నాగచైతన్య కలిసి ఓ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ చేయాలని చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇలా వెంకీ బాటలో నడుస్తున్న రానా.. వీలు కుదిరినప్పుడల్లా ఇతర హీరోతో మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు.
కాగా, 'అరణ్య' అనే త్రిభాషా చిత్రాన్ని ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన రానా.. 'విరాటపర్వం' అనే వైవిధ్యమైన సినిమాని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. 1990ల నాటి నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రానుంది.
అలానే విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ లో రానా ఓ మూవీకి సైన్ చేశారు. 'టాప్ హీరో' 'దేవుడు' 'జంబలకిడి పంబ' వంటి సినిమాలను నిర్మించిన ఆచంట గోపినాథ్ మరో నిర్మాత సీహెచ్ రాంబాబుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని నిర్మాతలు ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తారు.