• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరంజీవి గారన్న ఆ ఒక్క...

చిరంజీవి గారన్న ఆ ఒక్క మాట చాలు: సందీప్ కిషన్

By - Tupaki Desk
Update: 2021-09-16 04:31 GMT
సందీప్ కిషన్ హీరోగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో 'గల్లీ రౌడీ' సినిమా రూపొందింది. 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' హిట్ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమైన సినిమా ఇది. నేహా శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా బాబీ సింహా కనిపించనున్నాడు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి  సినిమా ప్రీ  రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ వేదికపై సందీప్ కిషన్ మాట్లాడాడు.

'A 1 ఎక్స్ ప్రెస్' తరువాత ఒక మంచి కమర్షియల్ ఫన్నీ ఎంటర్టైనర్ చేయాలి అనుకున్నాను. ఎక్కవ ఆలోచించే సినిమా కాకుండా సరదాగా నవ్వుకునే సినిమా చేయాలి అనుకున్నాను. అలాంటి సమయంలో భాను - సాయి నాకు ఈ కథ చెప్పారు. ఆ కథ నాకు బాగా నచ్చింది. నాగేశ్వర రెడ్డి గారి దగరికి వాళ్లను పంపించాను. కథ వినగానే 'చాలా బాగుంది .. చేద్దాం' అని ఆయన అన్నారు. సాధారణంగా మేము అంత కష్టపడ్డాం ,.. ఇంత కష్టపడ్డాం అని చాలామంది చెబుతూ ఉంటారు. నిజానికి ఈ సినిమా కోసం మేము ఎంతమాత్రం కష్టపడలేదు.

మా పాత్రలను ఎంజాయ్ చేస్తూ .. చాలా సరదాగా ఈ సినిమాను పూర్తి చేశాము. ఎవరూ ఏ   విషయంలోను టెన్షన్ పడకుండా ఈ సినిమాకి పనిచేశారు. ఎవరికి ఇచ్చిన పాత్రను వాళ్లు బాగా చేశారు. ఒక క్రైమ్ కామెడీకి కాస్త మసాలా జోడించి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా తీస్తే ఎలా ఉంటుందనే ఒక ప్రయత్నం చేశాము. నేహా శెట్టి కూడా చాలా బాగా చేసింది .. కామెడీ టైమింగ్ తో చేయడం గొప్ప విషయం. ఈ సినిమాకి పనిచేసిన వాళ్లంతా పనికి విలువ ఇచ్చేవాళ్లు కావడం విశేషం. అలాంటివారు దొరకడం మా అదృష్టంగానే భావిస్తున్నాము.

ఈ రోజుల్లో ఒక సినిమా విజయాన్ని దేనితో కొలిచే పరిస్థితి లేదు. చూసిన ప్రేక్షకులందరికే సినిమా నచ్చిందంటే అది విజయం కిందే లెక్క. చిరంజీవిగారు  సినిమా ట్రైలర్ చూసి ''సందీప్ నీకు ఇలాంటి పాత్రలు బాగుంటాయి. ఇలాంటి పాత్రలు నీకు సెట్ అవుతాయి" అన్నారు. అంటే అంతకుముందు ఆయన నా వర్క్ చూశారన్న మాట. ఆయనన్న ఆ ఒక్క మాట చాలు .. ఆ మాటతో 'గల్లీ రౌడీ'కి అతి పెద్ద విజయాన్ని సాధించినట్టుగా నేను భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.             
Tags:    
  • gully rowdy 
  • gully rowdy movie release date 
  • gully rowdy pre release event 
  • Rajendra prasad 
  • Sundeep kishan gully rowdy 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS