• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుజరాతీ బ్యూటీ హైదరాబాద్...

గుజరాతీ బ్యూటీ హైదరాబాద్ లో సెటిల్ అయ్యిందిగా..??

By - Tupaki Desk
Update: 2021-06-26 15:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరై ఆ వెంటనే సినిమా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇటీవల బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ అందరిలో గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్.. భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. అలా బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిందో లేదో వార్తల్లో ఆమె పేరు వైరల్ అయిపోయింది. అంతలోనే అమ్మడు అల్లుడు అదుర్స్ సినిమాలో 'రంభ ఊర్వశి మేనకా..' అంటూ ఐటమ్ సాంగ్ లో అందాలను ఊపేసింది. అలాగే మోనాల్ మొన్నటివరకు ఓ డాన్స్ రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరించింది.

ఒకవైపు టీవీ షోస్ చేస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ వస్తే ఓకే చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలతో క్రేజ్ దక్కించుకోవాలని ట్రై చేస్తోంది. అమ్మడి జోరు చూస్తే త్వరలోనే వరుస సినిమా అవకాశాలతో బిజీ కాబోతున్నట్లు టాక్ నడుస్తుంది. ఇంతలో బిగ్ బాస్ లో తన ఫేవరేట్ అయినటువంటి అఖిల్ తో కలిసి పార్టీలు పబ్బులు అంటూ ఎంజాయ్ చేస్తుంది. గ్లామరస్ ఫోటోషూట్స్ చేస్తోంది. అలాగే అతనితో కలిసి ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లు మోనాల్ చెబుతోంది. ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఏ సెలబ్రిటీ అయినా ఇక్కడే సెటిల్ అవ్వాలని చూస్తుంటారు.

తాజాగా ఆ జాబితాలో మోనాల్ కూడా చేరింది. ఎందుకంటే అమ్మడు ఏకంగా హైదరాబాద్ లో ఇల్లు కొనేసింది. గృహప్రవేశం చేసి ఇక్కడే ఉంటోంది. తనకు తోడు కోసం ఆమె తల్లిని.. తను ఇష్టపడే పెట్ ను ఇంటికి తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియాలో పెట్టింది మోనాల్. మొత్తానికి హైదరాబాద్ లో ఇల్లు కొనేసాను. ఇప్పుడు నేను 'ఆఫీసియల్లీ హైదరాబాది' అంటూ పేర్కొంది. ప్రస్తుతం మోనాల్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీకి బాలీవుడ్ నుండి కూడా ఆఫర్స్ వస్తున్నాయట. కానీ అమ్మడు ప్రెసెంట్ కేవలం టాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టాలని ఇక్కడే సెటిల్ అయినట్లు సమాచారం. చూడాలి మరి త్వరలోనే బిగ్ న్యూస్ చెబుతుందేమో!
Tags:    
  • Monal Gajjar 
  • Monal Gajjar Latest Images 
  • Monal Gajjar Photos 
  • Telugu News 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS