• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలీవుడ్ మీద మండిపడ్డ...

బాలీవుడ్ మీద మండిపడ్డ సీనియర్ హీరో

By - Tupaki Desk
Update: 2017-03-06 10:23 GMT
ఒకప్పుడు బాలీవుడ్లో ఒక వెలుగు వెలిగాడు గోవిందా. బాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్లలో ఒకడిగా.. కామెడీ కూడా చాలా బాగా చేస్తాడని అతడికి మంచి పేరుండేది. ఐతే తర్వాత తర్వాత వరుస ఫ్లాపులతో ఫేడవుట్ అయిపోయాడు. మధ్యలో రాజకీయాల్లో అరంగేట్రం చేసి ఎంపీగా కూడా గెలిచాడు. ఐతే రాజకీయాల్లో దెబ్బ తిన్నాక ఇప్పుడు మళ్లీ ఆయన సినిమాల్లోకి పునరాగమనం చేశాడు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో తనే హీరోగా ‘ఆగయా హీరో’ అనే సినిమా చేశాడు గోవిందా. ఇంతకుముందు గోవిందా ‘హీరో నెం.1’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. దానికి ఇది సీక్వెల్ తరహా సినిమా అన్నమాట. ఐతే ఈ సినిమా తీసే క్రమంలో తాను చాలా కష్టాలు పడ్డానని.. తనకు ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సహకరించట్లేదని అంటున్నాడు గోవిందా. బాలీవుడ్లో గ్రూపులు ఎక్కువైపోయాయంటూ అతను మండిపడ్డాడు.

తాను రీఎంట్రీలో నిలదొక్కుకోకపోవడానికి కారణం బాలీవుడ్లోని క్యాంపు రాజకీయాలే అని.. ఇండస్ట్రీ మొత్తం వర్గాలుగా విడిపోయిందని.. ఆయా గ్రూపులతో టచ్‌ లో ఉన్న వారికే అవకాశాలు వస్తాయని.. లేకుంటే అంతే సంగతులని అసహనం వ్యక్తం చేశాడు గోవిందా. 'ఆగయా హీరో' సినిమా రూపొందించడానికి తాను ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని.. తాను క్యాంపుకీ చెందను కాబట్టి.. తన సినిమాకు పనిచేయడానికి పెద్ద పెద్ద టెక్నీషియన్లు ఎవరూ ముందుకు రాలేదని ఆరోపించాడు గోవిందా. తన సినిమాకు పని చేయమని కొందరు స్టార్ రైటర్లను అడిగితే.. వాళ్లు డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ చూసి కళ్లు తిరిగాయట గోవిందాకు. దీంతో తనే రచయితగా మారి ఈ సినిమాకు స్క్రిప్టు పూర్తి చేసినట్లు గోవిందా వెల్లడించాడు. ఎన్నో కష్టాలు పడి ఎలాగోలా సినిమాను పూర్తి చేస్తే విడుదలకు ఎవరూ సహకరించట్లేదంటున్నాడు గోవిందా. ఈ నెల 17న తన సినిమాను రిలీజ్ చేయబోతున్నానని.. ఇండస్ట్రీ వాళ్లు ఎలా ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని గోవిందా కోరాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Govinda 
  • Bollywood camps 
  • Telugu NEws 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS