• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కబడ్డి కూతకు ముహూర్తం...

కబడ్డి కూతకు ముహూర్తం ఖరారు

By - Tupaki Desk
Update: 2021-08-24 15:30 GMT
యాక్షన్‌ స్టార్‌ గోపీచంద్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన 'సీటీమార్‌' విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది. కరోనా కారణంగా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న సినిమాల్లో సీటీమార్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. సీటీమార్ సినిమా ను ఓటీటీ లో రిలీజ్ చేయబోతున్నారు అనే పుకార్లు షికార్లు చేశాయి. కాని మేకర్స్‌ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా సినిమా పై చాలా నమ్మకంతో థియేటర్‌ రిలీజ్ కు సిద్దం అయ్యారు. గోపీచంద్ తో పాటు తమన్నాల పాత్రలు ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంటాయి అంటూ మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉండే సీటీమార్ సినిమా సెప్టెంబర్‌ 3వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

మొదటగా ఈ సినిమాను సెప్టెంబర్‌ రెండవ లేదా మూడవ వారంలో విడుదల చేయాలని భావించారు. కాని రెండవ వారంలో లవ్‌ స్టోరీ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. మూడవ వారంలో కూడా ఇతర సినిమాలు క్యూ కట్టి ఉన్నాయి. దానికి తోడు కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ ఉన్నారు. కనుక సెప్టెంబర్‌ మొదటి వారంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే సాధ్యం అయినంత వరకు సినిమాకు వసూళ్లు వస్తాయనే నమ్మకంతో మేకర్స్ సెప్టెంబర్‌ 3 ను ఖరారు చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల్లో సినిమాపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఈ సినిమాలో గోపీచంద్‌ మరియు తమన్నాలు కబడ్డీ జట్ల కెప్టెన్ లుగా వ్యవహరించబోతున్నారు. తెలంగాణ అమ్మాయిల కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు లీడ్ ఇచ్చారు. గోపీచంద్‌ ఆంద్రా అమ్మాయిల జట్టు కెప్టెన్ గా కనిపించబోతున్నాడు. మొదట వీరిద్దరి మద్య పోటీ ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి తెలుగు జట్టు ను జాతీయ స్థాయికి తీసుకు వెళ్తారు అనేది కథ అంటూ ప్రచారం జరుగుతోంది. కథ చాలా ఇంట్రెస్టింగ్‌ గా కబడ్డీ ఆట అంటే ఇష్టపడే వారికి నచ్చే విధంగా ఉంది. సినిమా లో చాలా ఎక్కువ శాతం కబడ్డీ ఉంటుంది. కనుక ఆట ప్రియులకు ఖచ్చితంగా కబడ్డి  నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా వినోదాన్ని అందిస్తుంది అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

కమర్షియల్‌ సక్సెస్ కోసం గోపీచంద్‌ చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్నాడు. ఎట్టకేలకు ఈ సినిమా తో అయినా గోపీచంద్‌ కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకుంటాడా అనేది చూడాలి. సినిమా షూటింగ్‌ పూర్తి అయినప్పటి నుండి అదుగో ఇదుగో అంటూ వాయిదాలు వేస్తూ వచ్చిన సీటీమార్ ఎట్టకేలకు విడుదల కాబోతున్న నేపథ్యంలో తమన్నా అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమద్య కాలంలో తమన్నాకు కూడా మంచి బ్లాక్‌ బస్టర్ పడలేదు. అందుకే ఈ సినిమా తో ఆమె అభిమానుల కోరిక తీరుతుందేమో చూడాలి.
Tags:    
  • Gopichand 
  • Release Date 
  • Seetimaar 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS