ఆ హీరో మేనేజర్ని ఎందుకు తీసేశాడు?

Update: 2016-05-28 17:30 GMT
దొంగలు పడ్డా ఆర్నెల్లకు అని ఓ సామెత ఉంది కదా.. ఆ టైపులో ఉందీ వ్యవహారం. గోపీచంద్ సినిమా ‘సౌఖ్యం’ రిలీజై ఐదు నెలలు దాటింది. ఆ సినిమా డిజాస్టర్ అయినందుకు తన మేనేజర్ని తీసేశాడట గోపీ. ఇది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయి కూర్చుంది. అయినా సినిమా ఫ్లాపైతే దర్శకుడికి కటీఫ్ చెప్పాలి కానీ.. మేనేజర్ని తీసేయడమేంటి అన్న సందేహం రావచ్చు. ఐతే ఈ మేనేజర్ కొన్ని మంచి సబ్జెక్టులు గోపీ వరకు రాకుండా అడ్డం పడ్డాడట. తనను ప్రసన్నం చేసుకున్నవాళ్లకే గోపీచంద్ దర్శనం కలిగిస్తూ.. కొందరిని పక్కనబెట్టాడట. దీని వల్ల గోపీ కొన్ని మంచి కథలు మిస్సయిపోయాడట.

తన మేనేజర్ లీలల గురించి ఆలస్యంగా తెలుసుకున్న గోపీ.. అతడిని పీకేసినట్లు సమాచారం. ఐతే ‘పిల్లా నువ్వు లేని జీవితం’తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని.. ఇంతకుముందు తనకు ‘యజ్నం’తో లైఫ్ ఇచ్చాడనే కదా.. గోపీ ఏరికోరి రవికుమార్ చౌదరితో సినిమా చేసింది. మరి ఆ ఫెయిల్యూర్ కు రిలేట్ చేస్తూ మేనేజర్ కు పింక్ స్లిప్ ఇవ్వడమేంటో అని చర్చించుకుంటున్నారు జనాలు. ఆ సంగతలా వదిలేస్తే.. ‘లౌక్యం’ తర్వాత మళ్లీ ఫామ్ అందుకున్నాడనుకున్న గోపీకి ‘సౌఖ్యం’ పెద్ద షాకే ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ ఒకప్పటి స్థితిలో హిట్టు కోసం పోరాటం మొదులపెట్టేశాడు. ఎ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీస్తున్న ‘ఆక్సిజన్’ మీదే ప్రస్తుతం అతడి ఆశలన్నీ.
Tags:    

Similar News