గోపీచంద్ కూడా పవన్ ని వాడుకోవాలా?

Update: 2017-02-04 06:24 GMT
మాస్ లో మాంచి ఫాలోయింగ్ ఉన్న గోపీచంద్.. గతేడాది కొంచెం స్లో అయినా.. ఇప్పడు మాత్రం స్పీడ్ పెంచాడు. అటు ఆక్సిజన్ తో పాటు.. ఇటు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని కూడా రెడీ చేసేస్తున్నాడు. నిన్న ప్రీ లుక్ ఇచ్చిన ఈ చిత్రానికి.. ఇవాళ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

గోపీచంద్-సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీకి.. టైటిల్ గా 'గౌతమ్ నంద' అనే పేరు ఫైనల్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో గోపీచంద్ లుక్ సూపర్బ్ గా ఉంది. హెలికాప్టర్ పై చెయ్యేసి స్టైల్ గా ఇచ్చిన పోజ్ అదిరింది. స్టైలింగ్ కూడా ఆకట్టుకుంటోంది. అయితే.. ఈ మూవీ టైటిల్ ని గౌతమ్ నంద అని పెట్టడమే ఆశ్చర్యకరం. ఎందుకంటే.. అత్తారింటికి దారేది మూవీలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు ఇదే. పవన్ చేసిన కేరక్టర్ కావడంతో గౌతమ్ నంద అనే పేరు జనాల్లో బాగా రిజిస్టర్ అయిపోయింది.

ఆ పేరును ఇప్పుడు గోపీచంద్ ఉపయోగించుకోవడం ఆశ్చర్యకరం. చిన్నా చితకా హీరోలు అయితే.. జనాలను ధియేటర్లకు రప్పించడానికి ఇలా స్టార్ హీరోల రిఫరెన్సులు ఉపయోగించుకోవాలి. కానీ గోపీచంద్ కు బోలెడంత ఇమేజ్ ఉంది. అది కూడా మాస్ ఆడియన్స్ లో తెగ క్రేజ్ ఉంది. అలాంటిది గోపీచంద్ కూడా పవన్ రిఫరెన్స్ వాడడం ఆశ్చర్యకరమే. అయితే.. ఈ టైటిల్ వెనక సంపత్ నంది హ్యాండ్ ఉంటుందన్నది ఇండస్ట్రీ టాక్. పవన్ తో గబ్బర్ సింగ్ సీక్వెల్ కి వర్క్ చేసి బయటకు వచ్చేసినా.. పవన్ అంటే ఎంత ఇష్టమో.. ఇలా చెబుతున్నాడేమో అనిపించడంలో ఆశ్చర్యం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News