కళ్యాణ్ రామ్ మంచివాడికి భలే సెంటిమెంట్!
ఈ సంక్రాంతి బరిలో మొత్తం నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో మూడు పెద్ద సినిమాలే. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' సినిమాలపై భారీగా హైప్ ఉంది. ఇక రజనీకాంత్ తమిళ డబ్బింగ్ సినిమా 'దర్బార్' ను తక్కువ అంచనా వెయ్యలేం. కంటెంట్ జనాలకు కనెక్ట్ అయితే ఇది మిగతా సినిమాలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సినిమాల మధ్య పెద్దగా బజ్ లేకుండా రిలీజ్ అవుతున్న సినిమా 'ఎంత మంచివాడవురా'.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకుడు. 'శతమానం భవతి' లాంటి సినిమాతో సూపర్ హిట్ సాధించిన సతీష్ తన రెండవ సినిమా 'శ్రీనివాస కళ్యాణం' తో పూర్తిగా నిరాశపరిచాడు. మరోవైపు కళ్యాణ్ రామ్ సినిమాలు యావరేజ్ గా నెట్టుకొస్తున్నాయి కానీ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపే తరహా సినిమాలు మాత్రం రావడం లేదు. దీంతో ఈ సినిమాపై పెద్దగా బజ్ ఏర్పడలేదు. ఇక 'ఎంత మంచివాడవురా' టీమ్ కూడా ప్రమోషన్స్ విషయంలో పెద్దగా జోరు చూపించడం లేదు. ఇవన్నీ ఇలా ఉంటే సంక్రాంతికి భారీ సినిమాల హంగామా ఎక్కువగా ఉంటుంది. అందరి దృష్టి స్టార్ హీరోల సినిమాలపైనే ఉంటుంది. అది కూడా ఈ సినిమాపై జనాల ఫోకస్ తక్కువగా ఉండడానికి మరో కారణం.
అయితే ఇలాంటి అంశాలు ఎన్ని ఉన్నప్పటికీ ఈ సినిమాను తక్కువగా అంచనా వేయలేం. ఈ సినిమా సూపర్ హిట్ గుజరాతి సినిమాకు రీమేక్. అంటే మంచి కంటెంట్ ఉంది. దీనికి తోడు ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్న కుటుంబకథా చిత్రం. గత కొన్నేళ్ళుగా సంక్రాంతి హిట్లను పరిశీలిస్తే 'సోగ్గాడే చిన్ని నాయన'.. 'శతమానం భవతి'.. 'జైసింహా'.. 'F2'.. ఇలా అంచనాలు తక్కువగా ఉన్న సినిమాలే సంక్రాంతి సీజన్ లో సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ సెంటిమెంట్ కనుక మరోసారి రిపీట్ అయితే నందమూరి హీరో బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చాటడం ఖాయం. ఏ విషయం తెలియాలంటే సంక్రాంతి వరకూ వేచి చూడకతప్పదు.