• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్...

'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసింది..!!

By - Tupaki Desk
Update: 2022-07-01 14:33 GMT
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''గాడ్ ఫాదర్''. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మెగా మూవీ ఫస్ట్ లుక్ కు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది.

''గాడ్ ఫాదర్'' ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను జూలై 4న సాయంత్రం 5:45 గంటలకు లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా గాడ్‌ ఫాదర్ రాక కోసం ప్రజలు వర్షంలో గొడుగులు పట్టుకొని ఎదురుచూస్తున్న ఓ ఇంటెన్స్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

చిరు కెరీర్ లో 153వ చిత్రంగా రాబోతున్న 'గాడ్ ఫాదర్' లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది కండల వీరుడికి తెలుగు డెబ్యూ. చిరు - సల్మాన్ లపై ఓ సస్పెషల్ సాంగ్ కూడా ఉంది.

ఇద్దరు మెగాస్టార్స్ కోసం ఎస్ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఈ డ్యాన్స్ నంబర్ కు ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈ సినిమాలో సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార - టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్నారు. స్టార్ క్యాస్టింగ్ తో పాటుగా టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాలో భాగం అయ్యారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

'గాడ్ ఫాదర్' అనేది మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్‌’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్‌. అయినప్పటికీ మెగాస్టార్ ఇమేజ్ ని మరియు తెలుగు సెన్సిబులిటీస్ ని దృష్టిలో పెట్టుకొని చాలా మార్పులు చేర్పులు చేసారని తెలుస్తోంది.

హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ''గాడ్‌ ఫాదర్‌'' సినిమాలో చిరంజీవి సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ మరో మూడు రోజుల్లో విడుదల కాబోతోంది. అదే రోజున విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థలు కలిసి భారీ ఎత్తున మెగాస్టార్154 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బి చౌదరి - ఎన్‌వి ప్రసాద్‌ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వాకాడ అప్పారావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Tags:    
  • godfather 
  • movie 
  • chiranjeevi 
  • latestposter 
  • latestnews 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS