• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇంట్రెస్టింగ్ గా 'భూతద్దం...

ఇంట్రెస్టింగ్ గా 'భూతద్దం భాస్కర్ నారాయణ' ఫస్ట్ గ్లింప్స్..!

By - Tupaki Desk
Update: 2022-08-02 11:58 GMT
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి 'చూసీ చూడంగానే' అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో 'గమనం' 'మను చరిత్ర' వంటి చిత్రాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. నాని నిర్మాణంలో యువ హీరో చేసిన 'మీట్ క్యూట్' మూవీ రిలీజ్ కూడా రెడీగా ఉంది. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ట్రై చేస్తోన్న శివ.. ఇప్పుడు ''భూతద్దం భాస్కర్ నారాయణ'' అనే సరికొత్త సినిమాతో రాబోతున్నాడు.

శివ కందుకూరి హీరోగా పురుషోత్తం రాజ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''భూతద్దం భాస్కర్ నారాయణ''. మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై స్నేహల్ జంగాల - శశిధర్ కాశి - కార్తీక్ ముడుంబై సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో శివ సరసన రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు మంగళవారం సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

ఓ స్టేజ్ నాటకంలో.. 'రాక్షసుల వల్ల వినాశనం తప్పేలా లేదు.. వారి నుంచి కాపాడు భాస్కరా' అని విష్ణుమూర్తిని ఇంద్రుడు వేడుకోగా.. 'చింతించకు ఇంద్రదేవా.. కలియుగంబున భువిపైన జనియించి.. ఏ ఉపద్రవం తలెత్తకుండా చూసెదనని అభయం ఇస్తున్నాను' నారాయణుడు చెప్పడంతో 'భూతద్ధం భాస్కర్ నారాయణ' ఎంట్రీ ఇచ్చినట్లు ఈ వీడియోలో చూపించారు.

ఇందులో శివ గళ్ళ లుంగీ ధరించి నల్ల కళ్లజోడు పెట్టుకుని ఓ  రివాల్వర్ తీసుకుని.. పోలీస్ జీపు స్టైల్ గా దిగడాన్ని చూడొచ్చు. అలానే తుపాకీతో సిగరెట్ అంటించుకునే ప్రయత్నం చేయగా.. అందులో బుల్లెట్స్ లేకపోవడంతో.. అగ్గిపెట్టె అందుకుంటాడు. దాంట్లో అగ్గిపుల్లలు లేకపోవడంతో పక్కనే ఉన్న హీటర్ తో వెలిగించుకుంటాడు భూతద్ధం భాస్కర్ నారాయణ.

అంతేకాదు భూతద్దంతో ఏదో రహస్యాన్ని వెతుకుతున్నట్లు చూపిస్తూ 'భూతద్దం భాస్కర్ నారాయణ' టైటిల్ ను రివీల్ చేశారు. ఇందులో క్షీరసాగర మథనాన్ని చిలకడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందని చెప్పాలి. ఇందులో హీరో ఒక డిటెక్టివ్ గా కనిపించబోతున్నారని తెలుస్తుంది. అలానే పురాణాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించబోతున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తం మీద 'భూతద్దం భాస్కర్ నారాయణ' అనేది ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే డిటెక్టివ్ డ్రామా అనిపిస్తోంది. శివ కందుకూరి ఈ సినిమాలో సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఫస్ట్ గ్లింప్స్ లో విజువల్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలిచాయి. జనాల దృష్టిని ఆకర్షించడానికి మేకర్స్ వినూత్నమైన ప్రమోషనల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్లు ఫస్ట్ గ్లిమ్స్ చూస్తే అర్థం అవుతుంది.

'భూతద్దం భాస్కర్ నారాయణ' సినిమాకు శ్రీచరణ్ పాకాల మరియు విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చారు. గౌతమ్ జి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. రోషన్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో అరుణ్ - దేవీప్రసాద్ - వర్షిణి - శివకుమార్ - షఫీ - శివన్నారాయణ - కల్పలత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సి సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Full View

Tags:    
  • BhootaddamBhaskarNarayana 
  • Glimpses 
  • FirstLook 
  • RajKandhukuri 
  • ChoosiChudangane 
  • Movie 
  • ShivaKandukuri 
  • SeshidarKashi 
  • Karthik 
  • RashiSingh 
  • Heroine 
  • MovieNews 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS